Actor Srikanth : నాపై త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తే నోటీసులు ఇస్తానంటూ శ్రీకాంత్ వార్నింగ్

Actor Srikanth : బెంగళూరు శివారు ప్రాంతంలో జరిగిన రేవ్ పార్టీ ఇప్పుడు సినీ, రాజకీయ ప్రముఖులలో గుబులు పుట్టిస్తుంది. ఇప్పుడు రేవ్ పార్టీ ఇండ‌స్ట్రీలో ప్ర‌కంప‌న‌లు రేపుతుంది. రేవ్ పార్టీలో సినీ పరిశ్రమకు చెందినవారు, డైరెక్టర్లు, హీరోలు, రాజకీయ ప్రముఖులు కొందరు మొత్తం 100 మంది పాల్గొన్నారని తెలుస్తుంది. అంతేకాదు ఈ రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ పట్టుబడినట్టు సమాచారం .ఈ రేవ్ పార్టీలో తెలుగు స్టార్ హీరో శ్రీకాంత్ కూడా ఉన్నారని పెద్ద ఎత్తున ఒక వీడియో వైరల్ అయింది. ఇక దీనిపై శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. తన ఇంటిలో, హైదరాబాద్లో ఉన్నానన్నారు. బెంగళూరు శివారు ప్రాంతంలో జరిగిన రేవ్ పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని, అసలు తాను ఆ పార్టీకే వెళ్లలేదని శ్రీకాంత్ పేర్కొన్నారు.

నేను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్టు నన్ను అరెస్టు చేసినట్టు చాలామంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారని ఆయన వాపోయారు. రేవ్ పార్టీకి సంబంధించిన వీడియో క్లిప్స్ చూసానన్నారు. కొంతమంది మీడియామిత్రులు తనకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవడం వల్ల తనకు సంబంధించిన వార్తలను రాయలేదన్నారు. ఇక కొన్ని మీడియా ఛానల్స్ లో తాను రేవ్ పార్టీకి వెళ్లానని రాసారని ఆ న్యూస్ చూసి మా కుటుంబ సభ్యులందరం నవ్వుకున్నామన్నారు. వార్తలు రాసిన వాళ్ళు తొందరపడడంలో తప్పులేదు అనిపించిందని ఆయన పేర్కొన్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన వ్యక్తి ఎవరో కానీ కొంచెం తనలాగే ఉన్నాడని అతనికి కాస్త గడ్డం ఉందని ముఖం కవర్ చేసుకున్నాడని పేర్కొన్నారు.

Actor Srikanth sensational comments on youtube videos
Actor Srikanth

అయితే త‌న‌పై ఇంకా త‌ప్పుడు ప్ర‌చారాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో శ్రీకాంత్ స్పందించారు. ఈ వ్యవహారంపై నటుడు శ్రీకాంత్ స్పందిస్తూ… తనకు ఆ రేవ్ పార్టీకి సంబంధం లేదని మరోసారి తేల్చి చెప్పారు. తాను ఇంతకుముందు చెప్పినట్లు రేవ్ పార్టీకి వెళ్లలేదని, అక్కడ జరిగిన దానికి తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే తనపై తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. తన పరువుకు భంగం కలిగించేలా రాసే సంస్థలపై కోర్టుకు కూడా వెళ్తానని అన్నారు. మరోవైపు రేవ్ పార్టీ, డ్రగ్స్ వంటి వాటి జోలికి యువత వెళ్లకూడదని, ఆ దిశగా వారికి మీడియా సంస్థలు అవగాహన కల్పించాలని శ్రీకాంత్ అన్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago