Actor Srikanth : బెంగళూరు శివారు ప్రాంతంలో జరిగిన రేవ్ పార్టీ ఇప్పుడు సినీ, రాజకీయ ప్రముఖులలో గుబులు పుట్టిస్తుంది. ఇప్పుడు రేవ్ పార్టీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతుంది. రేవ్ పార్టీలో సినీ పరిశ్రమకు చెందినవారు, డైరెక్టర్లు, హీరోలు, రాజకీయ ప్రముఖులు కొందరు మొత్తం 100 మంది పాల్గొన్నారని తెలుస్తుంది. అంతేకాదు ఈ రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ పట్టుబడినట్టు సమాచారం .ఈ రేవ్ పార్టీలో తెలుగు స్టార్ హీరో శ్రీకాంత్ కూడా ఉన్నారని పెద్ద ఎత్తున ఒక వీడియో వైరల్ అయింది. ఇక దీనిపై శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. తన ఇంటిలో, హైదరాబాద్లో ఉన్నానన్నారు. బెంగళూరు శివారు ప్రాంతంలో జరిగిన రేవ్ పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని, అసలు తాను ఆ పార్టీకే వెళ్లలేదని శ్రీకాంత్ పేర్కొన్నారు.
నేను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్టు నన్ను అరెస్టు చేసినట్టు చాలామంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారని ఆయన వాపోయారు. రేవ్ పార్టీకి సంబంధించిన వీడియో క్లిప్స్ చూసానన్నారు. కొంతమంది మీడియామిత్రులు తనకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవడం వల్ల తనకు సంబంధించిన వార్తలను రాయలేదన్నారు. ఇక కొన్ని మీడియా ఛానల్స్ లో తాను రేవ్ పార్టీకి వెళ్లానని రాసారని ఆ న్యూస్ చూసి మా కుటుంబ సభ్యులందరం నవ్వుకున్నామన్నారు. వార్తలు రాసిన వాళ్ళు తొందరపడడంలో తప్పులేదు అనిపించిందని ఆయన పేర్కొన్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన వ్యక్తి ఎవరో కానీ కొంచెం తనలాగే ఉన్నాడని అతనికి కాస్త గడ్డం ఉందని ముఖం కవర్ చేసుకున్నాడని పేర్కొన్నారు.
అయితే తనపై ఇంకా తప్పుడు ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీకాంత్ స్పందించారు. ఈ వ్యవహారంపై నటుడు శ్రీకాంత్ స్పందిస్తూ… తనకు ఆ రేవ్ పార్టీకి సంబంధం లేదని మరోసారి తేల్చి చెప్పారు. తాను ఇంతకుముందు చెప్పినట్లు రేవ్ పార్టీకి వెళ్లలేదని, అక్కడ జరిగిన దానికి తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే తనపై తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. తన పరువుకు భంగం కలిగించేలా రాసే సంస్థలపై కోర్టుకు కూడా వెళ్తానని అన్నారు. మరోవైపు రేవ్ పార్టీ, డ్రగ్స్ వంటి వాటి జోలికి యువత వెళ్లకూడదని, ఆ దిశగా వారికి మీడియా సంస్థలు అవగాహన కల్పించాలని శ్రీకాంత్ అన్నారు.