Actor Krishna : టాలీవుడ్‌లో సూపర్ స్టార్ కృష్ణకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో ముఖ్యులనే విషయం తెలిసిందే. హీరోగా ఎంట్రీ ఇచ్చిన కృష్ణ… ఆ తర్వాత నిర్మాతగా,దర్శకుడిగా,ఎడిటర్ గా కూడా మారి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.56 ఏళ్ల నట ప్రస్థానంలో కృష్ణ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. మూస ధోరణిలో వెళుతున్న సినిమాకి సరికొత్త హంగులు అద్దారు కృష్ణ. ఈస్ట్‌మన్ కలర్,కౌబాయ్ జోనర్,ఫస్ట్ సినిమా స్కోప్, 70 ఎం ఎం, ‘స్పై’ జోనర్, ‘సస్పెన్స్’ థ్రిల్లర్…. ఇలా ఎన్నో జోనర్ లను టాలీవుడ్ కు పరిచయం చేసి టాలీవుడ్ సినిమా గురించి అంతటా మాట్లాడుకునేలా చేశారు. టాలీవుడ్ కు అసలైన ట్రెండ్ సెట్టర్ కృష్ణ అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి.
అప్పటి వరకు కౌబాయ్ సినిమాల రుచి తెలియని టాలీవుడ్ ప్రేక్షకులకు కృష్ణ కౌబాయ్ సినిమాలను పరిచయం చేశారు. చాలామంది హీరోలు కౌబాయ్ సినిమాలలో నటించినా కృష్ణకు వచ్చినంత క్రేజ్ మరే హీరోకు రాలేదు. అంతేకాకుండా తొలి ఈస్ట్ మాన్ కలర్ సోషల్ సినిమా కూడా కృష్ణదే కావడం విశేషం. ఇక 1974 వ సంవత్సరంలో వచ్చిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంతో టాలీవుడ్ కు ఫస్ట్ సినిమా స్కోప్ ను పరిచయం చేశారు. 1986 వ సంవత్సరంలో వచ్చిన ‘సింహాసనం’ చిత్రంతో 70 ఎం ఎం స్టీరియో ఫోనిక్ సౌండ్ ఫిలిం ను టాలీవుడ్ కు అందించారు కృష్ణ.
1995 వ సంవత్సరంలో వచ్చిన ‘తెలుగు వీర లేవర’ చిత్రంతో ఫస్ట్ డీటీఎస్ చిత్రాన్ని టాలీవుడ్ కు పరిచయం చేసిన వ్యక్తిగా కృష్ణ నిలిచారు. 1966 వ సంవత్సరంలో వచ్చిన ‘గూఢచారి 116’ తో టాలీవుడ్ కు ‘స్పై’ జోనర్ ను పరిచయం చేసిన ఆయన ఆ తర్వాత 1971 లో వచ్చిన ‘జేమ్స్ బాండ్’ చిత్రంతో కూడా ఆ హవాని కంటిన్యూ చేశారు. ఇక 1967 వ సంవత్సరంలో వచ్చిన ‘అవే కళ్ళు’ చిత్రంతో టాలీవుడ్ కు మర్డర్ మిస్టరీ జోనర్ ను కూడా పరిచయం చేశారు. ఇక సింహాసనం సినిమాతో బాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరిని టాలీవుడ్ కు పరిచయం చేశారు. ఇక 1967 వ సంవత్సరంలో సాక్షి సినిమా మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీనింగ్ కాగా, ఈ ఘనత దక్కించుకున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. దీంతో పాటు 2004లో శాంతి సందేశం సినిమాలో కృష్ణ నటించగా, ఇందులో కృష్ణ ఏసుక్రీస్తు పాత్రలో నటించారు. అప్పటి స్టార్ హీరోలు ఎవరూ అలాంటి పాత్ర చేసే సాహసం చేయలేదు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…