Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Actor Krishna : కృష్ణ ట్రెండ్ సెట్ట‌ర్‌గా మార‌డానికి కార‌ణాలు ఏంటో తెలుసా?

Shreyan Ch by Shreyan Ch
December 7, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Actor Krishna : టాలీవుడ్‌లో సూప‌ర్ స్టార్ కృష్ణ‌కి ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. ఆయ‌న తెలుగు సినిమా స్థాయిని పెంచ‌డంలో ముఖ్యుల‌నే విష‌యం తెలిసిందే. హీరోగా ఎంట్రీ ఇచ్చిన కృష్ణ‌… ఆ తర్వాత నిర్మాతగా,దర్శకుడిగా,ఎడిటర్ గా కూడా మారి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.56 ఏళ్ల నట ప్రస్థానంలో కృష్ణ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. మూస ధోర‌ణిలో వెళుతున్న సినిమాకి స‌రికొత్త హంగులు అద్దారు కృష్ణ‌. ఈస్ట్‌మన్‌ కలర్‌,కౌబాయ్ జోనర్,ఫస్ట్ సినిమా స్కోప్, 70 ఎం ఎం, ‘స్పై’ జోనర్, ‘సస్పెన్స్’ థ్రిల్లర్…. ఇలా ఎన్నో జోనర్ లను టాలీవుడ్ కు పరిచయం చేసి టాలీవుడ్ సినిమా గురించి అంత‌టా మాట్లాడుకునేలా చేశారు. టాలీవుడ్ కు అసలైన ట్రెండ్ సెట్టర్ కృష్ణ‌ అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి.

అప్పటి వరకు కౌబాయ్ సినిమాల రుచి తెలియని టాలీవుడ్ ప్రేక్షకులకు కృష్ణ కౌబాయ్ సినిమాలను పరిచయం చేశారు. చాలామంది హీరోలు కౌబాయ్ సినిమాల‌లో నటించినా కృష్ణకు వచ్చినంత‌ క్రేజ్ మరే హీరోకు రాలేదు. అంతేకాకుండా తొలి ఈస్ట్ మాన్ కలర్ సోషల్ సినిమా కూడా కృష్ణదే కావడం విశేషం. ఇక 1974 వ సంవత్సరంలో వచ్చిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంతో టాలీవుడ్ కు ఫస్ట్ సినిమా స్కోప్ ను పరిచయం చేశారు. 1986 వ సంవత్సరంలో వచ్చిన ‘సింహాసనం’ చిత్రంతో 70 ఎం ఎం స్టీరియో ఫోనిక్ సౌండ్ ఫిలిం ను టాలీవుడ్ కు అందించారు కృష్ణ‌.

Actor Krishna became trend setter know the reasons
Actor Krishna

1995 వ సంవత్సరంలో వచ్చిన ‘తెలుగు వీర లేవర’ చిత్రంతో ఫస్ట్ డీటీఎస్ చిత్రాన్ని టాలీవుడ్ కు పరిచయం చేసిన వ్యక్తిగా కృష్ణ నిలిచారు. 1966 వ సంవత్సరంలో వచ్చిన ‘గూఢచారి 116’ తో టాలీవుడ్ కు ‘స్పై’ జోనర్ ను పరిచయం చేసిన ఆయ‌న ఆ తర్వాత 1971 లో వచ్చిన ‘జేమ్స్ బాండ్’ చిత్రంతో కూడా ఆ హవాని కంటిన్యూ చేశారు. ఇక 1967 వ సంవత్సరంలో వచ్చిన ‘అవే కళ్ళు’ చిత్రంతో టాలీవుడ్ కు మర్డర్ మిస్టరీ జోనర్ ను కూడా పరిచయం చేశారు. ఇక సింహాసనం సినిమాతో బాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ బ‌ప్పి లహరిని టాలీవుడ్ కు పరిచయం చేశారు. ఇక 1967 వ సంవత్సరంలో సాక్షి సినిమా మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీనింగ్ కాగా, ఈ ఘ‌న‌త ద‌క్కించుకున్న‌ తొలి సినిమా ఇదే కావడం విశేషం. దీంతో పాటు 2004లో శాంతి సందేశం సినిమాలో కృష్ణ న‌టించ‌గా, ఇందులో కృష్ణ ఏసుక్రీస్తు పాత్ర‌లో నటించారు. అప్పటి స్టార్ హీరోలు ఎవరూ అలాంటి పాత్ర చేసే సాహసం చేయలేదు.

Tags: Actor Krishnacinema newsTollywood
Previous Post

Sr NTR Wedding Card : ఎన్టీఆర్ వివాహం ఎప్పుడు, ఎక్క‌డ జ‌రిగింది.. వైర‌ల్ అవుతున్న పెళ్లి ప‌త్రిక‌..

Next Post

Avatar 2 First Review : అవ‌తార్ 2 ఫ‌స్ట్ రివ్యూ…ఈ సినిమా ఎలా ఉందంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Sleep : నిద్ర‌లో ఉన్న‌ప్పుడు ఛాతి మీద ఏదో ఉన్న‌ట్లు అనిపించిందా ? అయితే అది ఇదే..!

by editor
September 19, 2022

...

Read moreDetails
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

by Shreyan Ch
September 23, 2024

...

Read moreDetails
politics

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

by Shreyan Ch
September 18, 2024

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.