37 Years Back Restaurant Bill : ఈ రోజుల్లో చాలా మంది ఇంటి తిండి కన్నా రెస్టారెంట్ తిండికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రేట్లు చాలా ఉన్నా కూడా అందులో తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంకొందరు అయితే ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని లాగించేస్తున్నారు. వేలకు వేలు బిల్లులు అవుతాయని ఆలోచించినా, కొందరు లగ్జరీ కోసం బయటకు వెళ్లి తినేసి వస్తున్నారు. అయితే డిల్లీలోని లజపత్ నగర్ లో ఉన్న లజీజ్ రెస్టారెంట్ &హోటల్ 1985 డిసెంబర్ 20 నాటి బిల్లును షేర్ చేయగా, అది చూసిన ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు. వాస్తవానికి 2013 ఆగస్టు 12న ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు మళ్లీ వైరల్‌గా మారింది.
ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ ప్రాంతంలో ఉన్న లాజీజ్ రెస్టారెంట్ & హోటల్ డిసెంబర్ 20, 1985 నాటి బిల్లును షేర్ చేసింది. బిల్లులో చూపిన విధంగా కస్టమర్ ఒక ప్లేట్ షాహీ పనీర్, దాల్ మఖ్నీ, రైతా, కొన్ని చపాతీలను ఆర్డర్ చేశారు. వస్తువుల ధర మొదటి రెండు వంటకాలకు రూ.8, మిగిలిన రెండింటికి వరుసగా రూ.5, రూ. 6 గా ధర ఫిక్స్ చేశారు. అయితే వాటి బిల్లు మొత్తం రూ.26 కావడం గమనార్హం. ఇది నేటి కాలంలో ఒక చిప్స్ ప్యాకెట్ ధరకు సమానం అని చెప్పాలి. ఇక ఈ బిల్లు షేర్ చేసినప్పటి నుండి ఈ పోస్ట్‌కి 1,800 లైక్‌లు, 587 షేర్లు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఇదే విషయాన్ని చూసి అవాక్కయ్యారు.
ఒక వినియోగదారు, “OMG… అది చాలా చౌకగా ఉండేది… అవును అయితే ఆ రోజుల్లో డబ్బు విలువ చాలా ఎక్కువ….” అని కొందరు కామెంట్ చేశారు. ఈ బిల్లు చూస్తే కొందరికి నవ్వుతో పాటు ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది. ” ఆ రోజులు చాలా బాగుండేవి,1968లో 20 లీటర్ల పెట్రోలుకు 20 రూపాయలు, పది పైసలు టైర్లలో గాలి కోసం ఖర్చుచేసేవాణ్ణి. ఆ బంకు ఇప్పటికీ వుంది, ఆంధ్ర మహిళా సభకు ఎదురుగా అనీ, 1972లో ఎస్పీఎస్ లో పని చేసేవాడినని, తన జీతం 550 రూపాయలని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ పాత బిల్లును దాచుకొని షేర్ చేసినందుకు ధన్యవాదాలు అని కామెంట్ చేశాడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…