యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాలలో సింహాద్రి ఒకటి. ఈ సినిమాలో భూమికతోపాటు.. హీరోయిన్ అంకిత కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఈ మూవీలోనే కాకుండా..లాహిరి లాహిరి లాహిరిలో.. ధనలక్ష్మి ఐ లవ్ యూ, ప్రేమలో పావని కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే 2009 వరకు వరుసగా సినిమాలు చేసిన అంకిత.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. సింహాద్రి చిత్రం 2003 జూలై 9 వ తేదీన విడుదలై అప్పట్లో పేను సంచలనాన్ని సృష్టించింది. దాదాపుగా ఈ సినిమాని రూ .8కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో నిర్మించారు.
చివరిసారిగా 2009లో వచ్చిన పోలీస్ అధికారి చిత్రంలో కనిపించింది అంకిత. ఆ తర్వాత చిత్రాలకు పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం ఆమె ఏం చేస్తుంది , ఎక్కడుంది అనే విషయం చాలా మందికి తెలియదు. అంకిత.. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్పట్లో ఫేమస్ అయిన రస్నా యాడ్ లో నటించి పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పలు కమర్షియల్ ప్రకటనలలో నటించింది. ఆ తర్వాత వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో అంకితకు ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉండేది.
అయితే వరుస హిట్స్ అందుకున్న ఆమె.. ఆ తర్వాత మెల్లగా ప్లాపులను కూడా ఖాతాలో వేసుకుంది. దీంతో అవకాశాలు తగ్గాయి. కొన్నాళ్ల తర్వాత పూణెకు చెందిన వ్యాపారవేత్త విశాల్‌ను పెళ్లి చేసుకుంది అంకిత. ఇక అనంతరం సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ప్రస్తుతం ఆమె తన తండ్రికి సంబంధించిన వజ్రాల వ్యాపారాన్ని చూసుకుంటూ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంది. అంకిత సోషల్ మీడియాలోనూ చాలా సైలెంట్. దీంతో ఆమె గురించి ఎవరికి పెద్దగా సమాచారం తెలియదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…