వినోదం

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన దేవ‌ర సినిమా చూడాలని ఉంద‌ని, దేవర సినిమా చూసేవరకైనా తనను బ్రతికించాలి అని అతను డాక్టర్లను వేడుకోవడం ప్రతి ఒక్కరిని షాక్ కు గురిచేసింది.తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్‌ డ్రైవర్‌ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు, సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు కౌశిక్‌ గత కొంత కాలంగా బ్లడ్ కేన్సర్‌ తో బాధ పడుతున్నాడు. ప్రస్తుతం కౌశిక్‌ చివరి స్టేజీ కేన్సర్‌ తో బాధ పడుతున్నట్లుగా వైద్యులు చెప్పారట. ఈ సమయంలో కౌశిక్‌ తల్లిదండ్రులకు.. నేను ఎలాగూ చనిపోతాను. మీరు బాధపడకండి.

ఎన్టీఆర్‌ దేవర సినిమా విడుదల అయి, నేను చూసే వరకు బతికించండి అంటూ విజ్ఞప్తి చేశాడట. ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్న కౌశిక్ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.బోన్ క్యాన్సర్ బారిన పడిన కౌశిక్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ డాక్టర్లను తనను సెప్టెంబర్ 27వ తేదీ వరకు దేవర సినిమా రిలీజ్ వరకు బ్రతికించాలని కోరుతున్నాడు.దేవర సినిమాను చూడడమే తన చివరి కోరిక అని చెబుతున్న కౌశిక్ వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ అతని కోరిక నెరవేరాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.

jr ntr talked to a fan on video a call who is suffering from disease

శ్రీనివాసులు, సరస్వతి దంపతులు తిరుపతిలో మీడియా ముందుకు వచ్చి తమ కొడుకు కౌశిక్‌ పరిస్థితిని తెలియజేసి కన్నీటి పర్యంతం అయ్యారు. తమ కొడుకు చివరి కోరిక తీర్చాలని మేము ప్రయత్నిస్తున్నాం. మాకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ గారు సాయం చేయాలని సరస్వతి విజ్ఞప్తి చేశారు. రూ.60 లక్షలతో బోన్‌ మారో చికిత్స చేయించాల్సి ఉందట. బెంగళూరులోని కిడ్‌వై ఆసుపత్రిలో ప్రస్తుతం కౌశిక్‌ కేన్సర్ చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే స్నేహితులు, సన్నిహితుల ద్వారా కొంత మొత్తం సాయం పొందిన కౌశిక్ కు ఇంకా భారీ మొత్తంలో చికిత్స కోసం డబ్బు అవసరం ఉందట.ఎన్టీఆర్ పైన వీరాభిమానంతో దేవర సినిమా చూసేవరకు బ్రతికించమని విజ్ఞప్తి చేస్తున్న కౌశిక్ ఆరోగ్య పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ వరకు చేరాలని ఎన్టీఆర్ అభిమానులు ఆయన్ని కూడా ట్యాగ్ చేస్తూ కౌశిక్ వీడియోను పోస్ట్ చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago