ICC World Cup 2023 : వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 ప్రైజ్‌మ‌నీ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుత‌ది..!

ICC World Cup 2023 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ నేటి నుండి మొద‌లు కానుంది. క్రికెట్‌లో అతిపెద్ద టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ గురువారం (అక్టోబర్ 5) భారతదేశంలో ప్రారంభమవుతుంది. నవంబర్ 14న జరిగే ఫైనల్లో టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి మొత్తం పది జట్లు ఒకదానితో ఒకటి పోటీపడతాయి. యితే ఇంత పెద్ద ఈవెంట్‌కు సంబంధించి విన్నర్, రన్నర్ ప్రైజ్‌మనీలు ఎంత ఉంటాయి? గ్రూప్ దశలో వెనుదిరిగిన జట్లకు ప్రైజ్ మనీ ఉంటుందా? ఈ ప్రశ్నలు క్రికెట్ ఫ్యాన్స్‌లో తలెత్తడం సహజం. అయితే వన్డే వరల్డ్ కప్ 2023కి సంబంధించిన ప్రైజ్‌మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. మొత్తం ప్రైజ్‌ మనీ రికార్డు స్థాయిలో 10 మిలియన్ డాలర్లుగా ఖరారు చేసింది. అంటే భారత కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ. 83 కోట్లుగా ఉంది.

ప్రైజ్ మనీ మొత్తాన్ని విన్నర్, రన్నర్, సెమీఫైనలిస్టులు, గ్రూప్ స్జేజ్‌లో వెనుదిరిగిన జట్లు పంచుకోనున్నాయి. ఇందులో సింహ భాగం విన్నర్‌కే దక్కనుంది. వరల్డ్ కప్ టైటిల్ విన్నర్‌కు రూ. 33 కోట్లు దక్కనున్నాయి. ఫైనల్‌లో ఓడిన జట్టు రూ. 16.58 కోట్లు చేజిక్కించుకోనుంది. ఇక సెమీ ఫైనల్ చేరకుండా నిష్క్రమించిన 6 జట్లకు రూ. 83 లక్షల చొప్పున దక్కనున్నాయి. గ్రూప్ స్టేజ్‌లో మొత్తం 45 మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిల్లో గెలుపొందిన జట్లు రూ. 33 లక్షల చొప్పున అందుకోనున్నాయి.ఇక టోర్న‌మెంట్‌లో భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మరియు నెదర్లాండ్‌లు పోటీ ప‌డ‌తాయి. రౌండ్-రాబిన్ ఫార్మాట్ లో మొదటి నాలుగు జట్లు సెమీ-ఫైనల్‌కు వెళుతుంది.

ICC World Cup 2023 prize money details
ICC World Cup 2023

ప్రపంచ కప్ 2023 మ్యాచ్ లు ఉద‌యం 10:30 AM మరియు 2:00 PM IST గంటలకు ప్రారంభమవుతాయి.ఇక లైవ్ స్ట్రీమింగ్ విష‌యానికి వ‌స్తే.. భారతదేశంలోని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. మొత్తం 48 మ్యాచ్‌లు డిస్నీ+ హాట్‌స్టార్‌లో యాప్ మరియు వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఉచితంగా మ్యాచ్‌ల‌ని వీక్షించ‌వ‌చ్చు. నవంబర్ 15న, 16 తేదీల్లో సెమీఫైనల్‌ మ్యాచులు జరగనున్నాయి. నవంబర్ 19న తుది పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరపడుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

17 hours ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

1 day ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

1 day ago

ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు ల‌లితా జ్యువెల్ల‌ర్స్ ఓన‌ర్ ఎంత స‌హాయం చేశారో తెలుసా..?

ఏపీలో వ‌ర‌ద‌లు సృష్టించిన వినాశ‌నం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. కొంద‌రు ఇప్ప‌టికీ దిక్కుతోచ‌ని స్థితిలో…

1 day ago

YS Jagan : జైలు ముందు జ‌గ‌న్‌తో మ‌హిళా కానిస్టేబుల్ సెల్ఫీ.. వైర‌ల్ అవుతున్న ఫొటో..

YS Jagan : ఈ ఎన్నిక‌ల‌లో ఘోరంగా ఓడిన జ‌గన్ ప్ర‌తి సంద‌ర్భంలో ప్ర‌భుత్వంపై ఏదో ఒక విధంగా విమ‌ర్శలు…

1 day ago

Harish Rao : కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌ల్ల రియ‌ల్ ఎస్టేట్ మొత్తం పోయింది: హ‌రీష్ రావు

Harish Rao : తెలంగాణ రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం, ఇష్ట‌మొచ్చిన‌ట్టు…

2 days ago

ఏపీ మందు బాబుల‌కు గుడ్ న్యూస్‌.. త‌క్కువ ధ‌ర‌కే మ‌ద్యం..?

గ‌త ప్ర‌భుత్వంలో నాసిర‌కం మ‌ద్యం వ‌ల‌న చాలా మంది చాలా ఇబ్బందులు ప‌డ్డారు.అయితే వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం…

2 days ago

YS Sharmila : చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర పాకెట్ మ‌నీ వ‌సూలు చేయ‌డం ఏంటి: ష‌ర్మిళ

YS Sharmila : వైఎస్ ష‌ర్మిళ ఇటు తెలంగాణ‌, అటు ఏపీలో నిప్పులు చెరుగుతూ దూసుకుపోతుంది. ఇన్నాళ్లు సొంత అన్న…

5 days ago