YSRTP : ఆ రోజునే కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీనం..?

YSRTP : ఏపీ రాజ‌కీయాలే కాదు, తెలంగాణ రాజ‌కీయాలు సైతం రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. రాజన్న బిడ్డ, వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ..కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్దమైనట్లుగా కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా గత కొద్ది రోజులుగా పాదయాత్రలో విమర్శలు చేస్తూ వచ్చిన వైఎస్ షర్మిల రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి పోరాడాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం షర్మిల భర్త అనిల్ కు ఎసిసిసి సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఫోన్‌ చేసినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అనిల్‌తో సోనియా, రాహుల్‌ పర్యటన గురించి వేణుగోపాల్‌ చర్చించినట్లు ఏఐసీసీ విశ్వసనీయ వర్గాల వెల్లడించాయి.

విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌తో సోనియా గాంధీ మాట్లాడ‌తార‌ని వేణు గోపాల్.. అనీల్‌కి తెలిపిన‌ట్టు స‌మాచారం. వచ్చేనెల 8వ తేదీన ఇడుపులపాయకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రానుండ‌గా,ఆ రోజు ఉద‌యం 11:30 గంటలకు ఇడుపులపాయ వద్ద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నివాళులు అర్పించ‌నున్నారు. ఆ రోజు సోనియా, రాహుల్‌ని క‌లిసి కాంగ్రెస్‌లో త‌మ పార్టీ విలీనం చేయ‌బోతున్న‌ట్టు ష‌ర్మిళ ప్ర‌క‌టించ‌నుందని అంటున్నారు. ఇది లాంఛ‌న‌మే అని పొలిటిక‌ల్ వ‌ర్గాలు చెప్పుకొస్తున్నాయి.

YSRTP may merge into congress party
YSRTP

తెలంగాణ కోడలిని అంటూ పార్టీని స్థాపించి..సుమారు రెండేళ్లుగా తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తూ వస్తున్నారు వైఎస్ షర్మిల. ఈక్రమంలోనే అటు రాష్ట్రంలోని బీఆర్ఎస్‌ని, కేంద్రంలోని బీజేపీ పాలకులపై విమర్శలు చేస్తూ వచ్చారు. తాజాగా వైఎస్‌ఆర్‌టీపీ కాంగ్రెస్‌లో విలీనం చేయడం, వైఎస్ షర్మిల కాంగ్రెస్‌కు జై కొట్టడంతో అంతా చకచకసాగిపోవడం వెనుక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు చర్చలు ఫలించినట్లుగా తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ష‌ర్మిళ కాంగ్రెస్ త‌ర‌పునే పోటీ చేయ‌నుంద‌ని స‌మాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచే షర్మిల పోటీ చేస్తానని మొదట్నుంచి ష‌ర్మిళ చెబుతూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పెద్దలతో కూడా అదే విషయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్‌ తరపున పాలేరు నుంచి బరిలోకి దిగడం కూడా కన్ఫామ్‌గా తెలుస్తోంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago