YS Sharmila : ఏపీ రాజకీయాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అన్నీ పార్టీలు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక జగన్ సోదరి షర్మిళ కూడా సంచలన ఆరోపణలు చేస్తూ వార్తలలో నిలుస్తుంది. కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా లోక్‌సభకు పోటీ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వదిన భారతిని ఉద్దేశ్యించి, “రాష్ట్రంలో మరెవరూ వైసీపికి పోటీ ఉండకూడదనుకుంటే ప్రత్యర్ధులు అందరినీ గొడ్డలితో నరికేయండి. అప్పుడు మీరు కోరుకుంట్లుగా రాష్ట్రంలో వైసీపి ఒక్కటే ‘సింగిల్ ప్లేయర్’గా ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని ప్రశ్నించేవారే రాష్ట్రంలో ఉండరు కూడా,” అని వైఎస్ షర్మిల అన్నారు.
భారతి ఇటీవల కడపలో ఎన్నికల ప్రచారం చేస్తూ కడపలో వైసీపి (అవినాష్ రెడ్డి) సింగిల్ ప్లేయర్ అని, ఆయనకు మరెవరూ పోటీ కారని అన్నారు. కడపలో తాను పోటీలో ఉండగా మరెవరూ పోటీలో లేరన్నట్లు వదినమ్మ భారతి మాట్లాడినందుకు వైఎస్ షర్మిల ఆగ్రహం కలిగిన్నట్లుంది. బహుశః అందుకే అలా అని ఉండవచ్చు. మరోవైపు ఎన్నికల్లో పరాజయం తప్పదని భావించి మా జగన్ మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్లిపోతున్నారంటూ చెప్పుకొచ్చారు షర్మిళ. ఊరు దాటి పోవడానికి, ఇక ఓటమిని ఒప్పుకుని అంగీకరించే పరిస్థితికి వచ్చేసారు. నేను ఓడిపోతే నా అరెస్టు ఖాయమని అనుకుని పాస్ పోర్ట్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అందుకే వాళ్లు విదేశీ ప్రయాణం పేరిట తప్పించుకునే ప్లాన్ చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేసింది.
అయితే జగన్ దంపతుల ఇద్దరు కుమార్తెలలో ఒకరు లండన్‌లో మరొకరు అమెరికాలో చదువుకుంటున్నారు. కనుక మే 13న ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన మర్నాడే లండన్‌లో కూతురు వద్దకు వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. కోర్టు అనుమతితో ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు వారు విదేశాలలో తమ కుమార్తెలతో గడిపి రావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు కూడా వారివురూ విదేశాలలోని తమ కుమార్తెల వద్దకు వెళ్ళి వచ్చారు. కానీ అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు కీలకమైన శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ఇంకా మొదలవక ముందే జగన్ దంపతులు విదేశాలకు బయలుదేరుతుండటం నిజమే అయితే అది ప్రజలకు ముఖ్యంగా వైసీపి శ్రేణులకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…