YS Sharmila : ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాలపై కసరత్తు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో గతంలో వర్కవుట్ అయిన సక్సెస్ ఫుల్ వ్యూహాలపైనా దృష్టిపెడుతున్నాయి. అలాంటిదే ఓ వ్యూహాన్ని ఇప్పుడు కాంగ్రెస్ లో ఎంట్రీ ఇచ్చిన కొత్త పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల కూడా అమల్లో పెడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా పై తొలి సంతకం పెడతానని స్వయంగా ప్రకటించినా నమ్మని ఏపీ ఓటర్లను నమ్మించేందుకు షర్మిల ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంతే కాదు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల్ని అమలు చేయని బీజేపీతో ఎందుకు అంటకాగుతున్నారని అన్న జగన్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారు.
ఇవే అంశాలు జనంలోకి వెళ్లి చర్చ మొదలైతే కచ్చితంగా బీజేపీతో జగన్ కు గ్యాప్ పెరుగుతుందని షర్మిల అంచనా వేసుకుంటున్నారు. వైఎస్ఆర్ కుటుంబం చీలింది అంటే చేతులారా చేసుకున్నది జగన్ ఆన్న గారే అంటూ చెప్పుకొచ్చారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి వైఎస్సార్ భార్య విజయమ్మ అని వివరించారు. యావత్ కుటుంబం దీనికి సాక్ష్యంగా ఉన్నరని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందిలో ఉన్నప్పుడు తాను నిలబడ్డానని చెప్పుకొచ్చారు. 18 మంది రాజీనామాలు చేసి జగన్ వైపు నిలబడితే అధికారంలోకి వచ్చాక మంత్రులను చేస్తా అన్నారని గుర్తు చేశారు. ఇవాళ వారిలో ఎంతమంది మంత్రులు ఉన్నారో చెప్పాలన్నారు. వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ,నేను వాళ్ళ కోసం తిరిగామని వివరించారు. వాళ్ళ గెలుపు కోసం పాటు పడ్డామన్నారు. వాళ్ళను గెలిపించామని గుర్తు చేశారు.
ఇక వైఎస్ షర్మిళ మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు ప్రతి విషయంలో బీజేపీ ఎంపీలకి సపోర్ట్ చేస్తున్నారు. జగన్, ఆయన పార్టీని,రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని ఘాటుగా ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ వైఎస్ఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపారు. అంతకు ముందు ఏ ప్రభుత్వాలు చేయని సాహసం వైఎస్ఆర్ చేశారని అన్నారు. వైఎస్సార్ 2004 లో ముఖ్యమంత్రిగా ఆయిన 6 నెలల్లో ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టారని వివరించారు. వైఎస్సార్ హయాంలో 4500 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు తవ్వించారని… ఆయన మరణం తర్వాత టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్ట్ ను నిరక్ష్యం చేశాయని ఆరోపించారు. గన్ ప్రభుత్వంలో వ్యవసాయం దండగ అయిందన్నారు. వైఎస్సార్ హయాంలో వ్యవసాయం ఒక పండుగగా మార్చారని అభిప్రాయపడ్డారు షర్మిళ.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…