YS Sharmila : ప్రస్తుతం ఏపీలో వార్ మాములుగా జరగడం లేదు. ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పిసిసి అధ్యక్షురాలు షర్మిల పోరాటం ఉధృతం చేశారు. బాపట్లలో నిర్వహించిన రోడ్‌షోకు ఊహించని విధంగా జనం తరలి వచ్చారు. గత కొద్ది రోజులుగా షర్మిల, జగన్ అభిమానుల మధ్య జరుగుతున్న పోరును మరింత ఉధృతం చేశారు.జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో షర్మిల సోదరుడు జగన్ మోహన్ రెడ్డిని ఏకవచనంలో పిలవడంతో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. షర్మిలను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో షర్మిల ఇకపై జగనన్న అంటానని ప్రకటించారు.
పీసీసీ అధ్యక్షురాలికి భద్రత కల్పించడం లేదంటే అసలు ప్రజాస్వామ్యంపై చిత్తశుద్ధి ఉందా అంటూ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్తానికి రక్షణ ఉంటే సరిపోతుందా ? పెద్దపెద్ద హోటళ్లు, గడుల్లో ఉంటూ రక్షణ కల్పించుకుంటే ప్రతిపక్షాలకు, ప్రజలకు రక్షణ కల్పించే అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి్ంది చాలని అన్నారు. ఈసారైనా అసెంబ్లీలో ప్రత్యేక హోదా , పోలవరం రాజధాని పై చర్చ జరిపి తీర్మానం చేసి రాష్ట్రపతికి, కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. షర్మిల ప్రసంగాల్లో జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగనన్న అంటూనే ఆయనపై కోపాన్ని దాచుకునే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు.
పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నా ఎప్పుడు ప్రజల మధ్యకు రారని ఎద్దేవా చేవారు. ఎన్నికలు వచ్చాయని సిద్ధం అంటూ బయటకు వచ్చారని, దేనికి సిద్ధం జగన్ సార్..? అని నిలదీశారు. మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా అని విమర్శించారు. బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా ? అని ప్రశ్నించారు.ఇక షర్మిళ నిర్వహించిన సభలో ఓ వ్యక్తి మాట్లాడుతూ రాజన్న రాజ్యంలో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు అందుకున్నాం. కాని ఆయన తనయుడు మాత్రం ఏం చేస్తున్నాడు. జగన్ వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు నువ్వన్నా కూడా ఏదైన చేస్తావని ఆశిస్తున్నాం అని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…