Undavalli : ఏపీ రాజకీయాలు రోజురోజుకి ఆసక్తిని రేపుతున్నాయి. ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు ప్రతిపక్షంలో నిలుస్తారు అనేదానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.ఏపీ రాజకీయాలు, సీఎం జగన్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఎన్ని రకాల తప్పులు చేయకూడదో అన్నీ చేసుకుంటూ పోతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యమంటూ అధికార వైసీపీ(Ysrcp) ప్రచారం మొదలుపెట్టింది. అయితే 175 స్థానాల్లోనూ జగనే పోటీ చేస్తున్నారని ఉండవల్లి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వైసీపీకి అనుకూలత ఉందన్నారు.
చదువుకున్నవాళ్లు రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, ఇతర కారణాలతో వైసీపీకి వ్యతిరేకం అవుతున్నారు. అయితే వైసీపీ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామంటూ టీడీపీ హామీ ఇస్తుందని, కానీ ఇవన్నీ ఎలా సాధ్యమనే విషయాలను ప్రజలు ఒకసారి పరిశీలన చేసుకోవాలని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవర్ని గెలిపించుకోవాలో ప్రజలు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చారన్నారు. జగన్ కాకుండా చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు గ్యారంటీగా రద్దవుతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపించుకోవాలనేది ప్రజలకు బాగా తెలుసునని ఉండవల్లి అరుణ్ కుమార్ తేల్చి చెప్పారు. వాళ్లు ఇప్పటికే ఈ విషయంపై ఓ నిర్ణయానికి వచ్చారని అన్నారు. పట్టణ ఓటర్లల్లో వైఎస్ఆర్సీపీపై కొంత వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. దీనికి గల కారణాలనూ వివరించారు.
రోడ్లు బాగు చేయలేదనే అభిప్రాయం పట్టణ ఓటర్లల్లో బలంగా నాటుకుపోయిందని, ఇది వైఎస్ఆర్సీపీపై వ్యతిరేకత ఏర్పడటానికి ఓ కారణమని చెప్పారు. అర్బన్ ప్రాంతంలో చదువుకున్న వాళ్లు జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నారని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్సీపీ లెక్కలు మాత్రం వేరేగా ఉన్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించారు. వైఎస్ జగన్ కాకుండా.. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మాత్రం ఈ సంక్షేమ పథకాలన్నీ గ్యారంటీగా రద్దయిపోతాయని ప్రజలకు తెలుసునని, అందుకే ఎవరిని గెలిపించుకోవాలో ఇప్పటికే నిర్ణయానికి వచ్చారని ఉండవల్లి అన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…