YS Jagan : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ గడువు పూర్తి అయ్యే సమయానికి బొత్స సత్యనారాయణ ఒక్కరే నామపత్రాలు దాఖలు చేశారు. దీంతో పోటీలో ఎవరూ లేకపోవడంతో ఆయనే ఏకగ్రీవంగా విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆయన ఎమ్మెల్సీగా గెలవడంతో.. శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు.. ఇవాళ తన చాంబర్‌లో బొత్స సత్యనారాయణతో ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించారు. చైర్మన్ మోషేన్ రాజు కార్యాలయంలో ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన మరుసటి రోజే ఆయను శాసన మండలిలో ప్రతిపక్షనేతగా గుర్తించాలని వైఎస్సార్సీపీ పార్టీ నేత జగన్ శాసనమండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు.
బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైనందున ఆయనను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత.. ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా వైఎస్ జగన్‌ను బొత్స సత్యనారాయణ కలిశారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియామకం అయ్యారు. ఇప్పటివరకు ఫ్లోర్ లీడర్‌గా ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు లేఖ రాశారు.
ప్రస్తుతం శాసన సభలో వైసీపీ కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో మండలిలో వైసీపీ సభ్యుల పాత్ర క్రియాశీలంగా మారింది. అయితే బొత్స ఇప్పుడు మండలికి నాయకత్వం వహించడం పార్టీకి ప్రయాజనంగా మారింది. బొత్స నాయకత్వం వహించడం అన్నిరకాలుగా మంచిదని వైసీపీ నాయకులు చెబుతున్నమాట. ఇప్పటివరకు ఫ్లోర్ లీడర్‌గా ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు లేఖ రాశారు. ఈ క్రమంలోనే బొత్స సత్యనారాయణను శాసనమండలి పక్షనేతగా నిర్ణయిస్తూ వైసీపీ అధిష్ఠానం లేఖ ఇవ్వనుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…