Chiranjeevi : చిరంజీవి ఇప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా..?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఒక‌ప్పుడు స్టార్ హీరోగా ఎంత పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల‌లోకి వ‌చ్చారు. కష్టపడి మాత్రం కొనసాగ దలచుకోలేదు. ఆయన ప్రజా సేవ చేయాలని తపించిన వారే. ఆయనలో ఆ సేవాభావం లేకపోతే బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంకులను ఎందుకు స్థాపిస్తారు. అది కూడా సినిమాల్లో బిజీగా ఉంటూ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అవి.రాజకీయాల్లో హుందాతనం లేకపోవడంతో పాటు చిరంజీవి మృదువుగా వ్యవహరించే నేచర్ వల్ల కొనసాగలేక పోయారు. పైగా ఆయన రాజకీయ అరంగేట్రం సమయం కూడా రాంగ్ గా ఉంది.

ఒక వైపు వైఎస్సార్ మరణం చెందడం, మరో వైపు ఉమ్మడి ఏపీ రెండుగా చీలడంతో ఆయన ఏ వైపు ఉండాలో ఏమి చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అని అనుకున్నారు అంతా. అయితే చిరంజీవి తెలివిగా చేసింది ఏంటి అంటే తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కేంద్ర మంత్రి అయ్యారు. అలా తన రాజకీయ ప్రస్థానానికి అందమైన ముగింపు ఇచ్చారు. అంతే 2018లో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తరువాత ఆ వైపు తొంగి చూడలేదు, వంగి వాలలేదు. గత పది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి ఆ పార్టీ నాయకులతో అంటిముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు.

does Chiranjeevi still in congress party what they are saying
Chiranjeevi

ప్ర‌ధాని నరేంద్ర మోదీ మెగాస్టార్ చిరంజీవికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఇక చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరమైనట్లే అని అందరూ అనుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని 2027 అక్టోబర్ నెల వరకు రెన్యువల్ చేసిన ఐడి కార్డును కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడంతో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు షాక్ అయ్యారు. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికీ చిరంజీవి త‌మ పార్టీలో ఉన్నాడ‌ని చెప్పుకుంటుండ‌డం కొస‌మెరుపు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago