YS Jagan : వైఎస్ జగన్ జూన్ 9న మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ నాయకులు చెబుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. జూన్ 4న వెల్లడికాబోయే ఫలితాల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని తాము విశ్వాసంతో ఉన్నామని అన్నారు బొత్స. విజయనగరంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లుగా ప్రజలతో ముఖ్యమంత్రి జగన్ ప్రజలతో మమేకమయ్యారని.. ప్రజా అవసరాలకు తగ్గట్లుగా ఆయన పాలన చేపట్టారని అన్నారు. జగన్ తీసుకున్న సామాన్య పౌరుడు ఆర్థికంగా ఎదిగేలా తీసుకున్నామని అన్నారు. సామాన్యులకు పూర్వం నుంచి అందుతూ వస్తున్న సేవల విషయంలో సీఎం జగన్ సంచలన మార్పులు తీసుకొచ్చారని అన్నారు. విద్య, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని అన్నారు. ఇలాంటి విధానాలు ప్రభుత్వం మారితే పోతాయని బొత్స అన్నారు.
తన సొంత నియోజకవర్గం ఉన్న విజయనగరం జిల్లాలో ఉన్న 9 స్థానాల్లోనూ గడిచిన ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టారని అన్నారు. అదే తరహాలో ఈ సారి పట్టం కడతారని విశ్వాసంతో ఉన్నట్లుగా బొత్స సత్యనారాయణ నమ్మకం వ్యక్తం చేశారు. ఆ జిల్లాలో తాము అనుకున్న దాని కంటే రెండు శాతం ఎక్కువగా పోలింగ్ జరిగిందని అన్నారు. ఇంకా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజలకు గుమ్మం ముందుకే పాలన తీసుకువచ్చామని చెప్పారు. అందుకే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామని.. దానికి చాలా మంచి పేరు వచ్చింది. ఇక్కడి పరిస్థితులను చూసి చాలా రాష్ట్రాల వాలంటీర్ వ్యవస్థను అమలు చేయడానికి రెడీగా ఉన్నాయని అన్నారు.
మరోవైపు . పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నా తాము మాత్రం ఫలితాల ముందు తాత్కాలిక ఆనందాల జోలికి వెళ్లడం లేదని చెప్పారు. అయితే కౌంటింగ్ రోజు పార్టీ ఏజెంట్లంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా చూడాలని కోరారు. ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల ఆటలు సాగనివ్వరాదని పేర్కొన్నారు. తమదే గెలుపంటూ జగన్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుందని తెలియజేశారు జగన్ . ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…