YS Jagan : ఏపీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. ఈ క్రమంలో నేడు ఎన్నికల ఫలితాలు విడుదల కాగా, టీడీపీ కూటమి విజయభేరి మోగించిందని చెప్పాలి. ఏపీ వ్యాప్తంగా కూటమి జోరు కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు విజయం సాధించని ప్రాంతాలలో కూడా టీడీపీ గెలుపొందడం ఆశ్చర్యం కలిగించింది. అన్ని జిల్లాలలో దాదాపుగా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది. ఇక చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చేయం. అయితే వైనాట్ 175 స్లోగన్‌తో జగన్ ముందుకు వెళ్లగా,వైసీపీ ప్రస్తుతానికి 14 స్థానాలలో మాత్రమే గెలిచింది. అయితే ఇంత దారుణంగా జగన్ పార్టీ ఓడిపోవడానికి పలు కారణాలు చెబుతున్నారు.
చంద్రబాబు అరెస్ట్ జగన్‌కి పెద్ద దెబ్బ అని చెప్పాలి. చంద్ర బాబు అరెస్ట్ అంశం చాలా పెద్ద ఎఫెక్ట్ చూపించిందని సర్వత్రా వినిపిస్తోంది. సైలెంట్‌గానే ఈ విషయం పెద్ద దెబ్బ విసినట్లు కనిపిస్తోంది. అవినితీ కేసులో చంద్రబాబును వైఎస్సార్‌సీపీ జైలుకు పంపగగా, ఇది వైసీపీకి ప్రతికూల ప్రభావం పడినట్లు కనిపిస్తోంది. ఇక చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయనకి జగన్‌తో వైరం ఉంది. అదే జగన్ స్థానంలో చంద్రబాబు వస్తే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అభివృధ్ధిలో ముందుకు సాగుతాయని ప్రజలు భావించి ఉంటారు. ఇక కాంగ్రెస్ తెలంగాణాలో ఉచిత బస్సు పథకం ఇవ్వగా, ఇప్పుడు అదే పథకాన్ని ఇస్తామని చంద్రబాబు తమ మేనిఫెస్టోలో ప్రకటించారు.
కూటమి మేనిఫెస్టో కూడా ప్రజలు మెచ్చి ఉంటారు అనే టాక్ వినిపిస్తుంది. ఇక జగన్ పథకాలని మించి కూటమి మేనిఫెస్టో ఉండడంతో ప్రజలందరు కూడా కూటమివైపే ఆసక్తి చూపారు. బాబు కొంత డబ్బు ఆశ కూడా చూపించాడనే టాక్ నడుస్తుంది. మరోవైపు ఇప్పటి వరకు ఏపీ రాజధాని విషయంలో జగన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆ గందరగోళం నడుము ప్రజలు చంద్రబాబుకి పట్టం కట్టారు. భూములను రీసర్వే చేయడం. పాస్ బుక్‌లపై జగనన్నా ఫోటో వేయడం వంటి అంశాలు కూడా ఎన్నికల ముందు పెద్ద చర్చకు దారితీశాయి. దీని వల్ల కూడా ప్రతికూల ప్రభావం పడిందని అనుకోవచ్చు.వాలంటీర్ వ్యవస్థ కూడా వైసీపీకి దెబ్బేసిందని చెప్పుకోవచ్చు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ పెట్టి కూడా జగన్ ఓడిపోవడం గమనార్హం. అంటే దీని ప్రకారం చూస్తే వాలంటీర్ వ్యవస్థ వల్ల ఒరిగిందేమీ లేదని అనుకోవచ్చు.