ఇలాంటి అద్భుతమైన ఫీల్డింగ్ ఇంతకు ముందు చూసి ఉండరు.. ప్రాణాలకు తెగించి మరీ.. వీడియో చూస్తే మీరు కూడా..!

టీ 20 వరల్డ్ కప్ గ్రూప్‌-1లో భాగంగా బ్రిస్బేన్‌ వేదికగా నిన్న (అక్టోబర్‌ 31) ఆస్ట్రేలియా-ఐర్లాండ్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదటి బౌలింగ్‌ చేసిన ఐర్లాండ్‌.. ప్రత్యర్ధికి భారీ స్కోర్‌ చేసే అవకాశం కల్పించింది. ఐర్లాండ్‌ బౌలర్లు బ్యారీ మెక్‌ కార్తీ (3/29), జాషువ లిటిల్‌ (2/21) మినహా అంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (44 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా.. మిచెల్‌ మార్ష్‌ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్కస్‌ స్టొయినిస్‌ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, సిక్స్‌), టిమ్‌ డేవిడ్‌ (10 బంతుల్లో 15 నాటౌట్‌; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించారు.

అనంతరం 180 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో​కి దిగిన ఐర్లాండ్‌ 25 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 18.1 ఓవర్లలో 137 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 14 వ ఓవర్లో ఓ అద్భుతం జరిగింది. అప్పటికే 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా టీం 113 పరుగులు చేసింది. క్రీజులో మార్కస్ స్టోయినీస్, ఆరోన్ ఫించ్ క్రీజులో ఉన్నారు. అయితే, మార్క్ ఐదర్ బౌలింగ్ చేస్తున్నాడు. భారీ బౌండరీ కోసం స్టోయినీస్ బంతిని బలంగా కొట్టాడు. ఇక బౌండరీ లైన్ వద్ద ఫీల్డిండ్ చేస్తున్న మెక్‌కార్తీ తన అద్భుత ఫీల్డింగ్‌తో అందర్నీ మెప్పించాడు.

you have not seen this type of fielding in cricket viral video

ఏకంగా ప్రాణాలకు తెగించి, బౌండరీని ఆపేశాడు. దీంతో ప్రత్యర్థి ఆటగాళ్లే కాదు.. స్టేడియంలోని ప్రేక్షకులు కూడా చప్పట్లతో అభినందించారు. బౌండరీని ఆపేందుకు పరిగెత్తుకుంటూ వచ్చిన మెక్ కార్తీ.. అమాతం గాల్లోకి జంప్ చేసి బాల్‌ను క్యాచ్ అందుకున్నాడు. అయితే, బౌండరీ అవతల పడేలా ఉండడంతో, బంతిని వెనకకు విసిరేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా బలంగా కిందపపడంతో కొద్దిగా దెబ్బతగిలినట్లైంది. ఆ తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, మరలా ఫీల్డింగ్‌కు వచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో మెక్ కార్తీ అటు ఫీల్డింగ్‌తోనే కాదు.. ఇటు బౌలింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. మెక్ కార్తీ అద్భుతమైన ఫీల్డింగ్ ని కింది వీడియోలో చూడొచ్చు.

Share
Usha Rani

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago