టీ 20 వరల్డ్ కప్ గ్రూప్-1లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా నిన్న (అక్టోబర్ 31) ఆస్ట్రేలియా-ఐర్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదటి బౌలింగ్ చేసిన ఐర్లాండ్.. ప్రత్యర్ధికి భారీ స్కోర్ చేసే అవకాశం కల్పించింది. ఐర్లాండ్ బౌలర్లు బ్యారీ మెక్ కార్తీ (3/29), జాషువ లిటిల్ (2/21) మినహా అంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఆరోన్ ఫించ్ (44 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా.. మిచెల్ మార్ష్ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్కస్ స్టొయినిస్ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించారు.
అనంతరం 180 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ 25 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 18.1 ఓవర్లలో 137 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 14 వ ఓవర్లో ఓ అద్భుతం జరిగింది. అప్పటికే 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా టీం 113 పరుగులు చేసింది. క్రీజులో మార్కస్ స్టోయినీస్, ఆరోన్ ఫించ్ క్రీజులో ఉన్నారు. అయితే, మార్క్ ఐదర్ బౌలింగ్ చేస్తున్నాడు. భారీ బౌండరీ కోసం స్టోయినీస్ బంతిని బలంగా కొట్టాడు. ఇక బౌండరీ లైన్ వద్ద ఫీల్డిండ్ చేస్తున్న మెక్‌కార్తీ తన అద్భుత ఫీల్డింగ్‌తో అందర్నీ మెప్పించాడు.
ఏకంగా ప్రాణాలకు తెగించి, బౌండరీని ఆపేశాడు. దీంతో ప్రత్యర్థి ఆటగాళ్లే కాదు.. స్టేడియంలోని ప్రేక్షకులు కూడా చప్పట్లతో అభినందించారు. బౌండరీని ఆపేందుకు పరిగెత్తుకుంటూ వచ్చిన మెక్ కార్తీ.. అమాతం గాల్లోకి జంప్ చేసి బాల్‌ను క్యాచ్ అందుకున్నాడు. అయితే, బౌండరీ అవతల పడేలా ఉండడంతో, బంతిని వెనకకు విసిరేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా బలంగా కిందపపడంతో కొద్దిగా దెబ్బతగిలినట్లైంది. ఆ తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, మరలా ఫీల్డింగ్‌కు వచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో మెక్ కార్తీ అటు ఫీల్డింగ్‌తోనే కాదు.. ఇటు బౌలింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. మెక్ కార్తీ అద్భుతమైన ఫీల్డింగ్ ని కింది వీడియోలో చూడొచ్చు.
View this post on Instagram