Yashoda Movie : అందాల ముద్దుగుమ్మ సమంత చాలా రోజుల తర్వాత మంచి హిట్ కొట్టింది. సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం `యశోద`. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా, కలక్షన్లు ఓ మోస్తరుగా ఉన్నా కూడా బిజినెస్ పరంగా నిర్మాతలని సేఫ్ జోన్‌లో పడేసింది.ఈ సినిమాతో నిర్మాతలకు సమంత విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. సమంతతో సినిమా చేస్తే గిట్టు బాటు అవుతుందని వారు ఓ నిర్ణయానికి వచ్చారు. యశోద సినిమా నిరాశపరచకపోవడంతో యశోద 2 తీసే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. యశోద 2 మాత్రమే కాదు.. యశోద 3 తీయడానికి కూడా కాన్సెప్టు తమ దగ్గరరెడీగా ఉందని దర్శకుడు హరి – హరీష్ తెలిపారు.
యశోద సీక్వెల్‌లో సమంత పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నట్లు సమాచారం. యశోద సినిమాలో పోలీస్ ట్రైనింగ్‌ను పూర్తిచేసుకున్న ఆమె అనివార్య కారణాల జాబ్‌లో జాయిన్ కాలేకపోయినట్లుగా చూపించారు. సీక్వెల్‌లో మాత్రం ఫుల్ ఖాకీ డ్రెస్‌లో సమంత కనిపించబోతున్నట్లు సమాచారం. పోలీస్ డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత సమంతకు ఎదురయ్యే సవాళ్లతతో సీక్వెల్ కథ ఉంటుందనే ప్రచారం నడుస్తుంది. ఉన్నిముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్ కలిసి సమంతపై రివేంజ్ తీర్చుకోవడానికి చేపే ప్రయత్నాలను సీక్వెల్‌లో చూపించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే రీసెంట్ గా సమంత ఆరోగ్యం బాగాలేదని తెలియడంతో.. ఈ సీక్వెల్స్ తెరకెక్కడంపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో సమంత ఇలాంటి పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ముందుకొస్తుందా? అనే డౌట్స్ షురూ అయ్యాయి. ఈ సీక్వెల్స్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లాలనేది సమంత చేతిలోనే ఉందని చెప్పుకుంటున్నారు జనం. యశోద సోషల్ అవేర్నెస్ ఫిల్మ్. కమర్షియల్ పంథాలో తీసినప్పటికీ… ఎమోషన్ ఉంది. ఆ భావోద్వేగాలు అందరికీ రీచ్ అయ్యేలా మాటలు రాసిన పులగం చిన్నారాయన, భాగ్యలక్ష్మి లకి దర్శకులు క్రెడిట్ ఇచ్చారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…