Yashoda Movie : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం యశోద. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాగా, సినిమాకు హిట్ టాక్ వచ్చింది. దీంతో థియేట్రికల్ కలెక్షన్స్ పరంగా మంచి వసూళ్లే వస్తున్నాయి. ఈ క్రమంలో యశోద సినిమాను మేకర్స్ ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకుంటున్న నేపథ్యంలో ఊహించని షాక్ తగిలింది. డిసెంబర్ రెండవ వారం నుంచి ప్రైమ్ వీడియోలో యశోద స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్సిమెంట్ మాత్రం రాలేదు.
యశోద సినిమా ఓటీటీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో చిత్ర ఓటీటీ విడుదలను డిసెంబర్ 19 వరకు విడుదల చేయడానికి వీల్లేదని సిటీ సివిల్ కోర్టు అదనపు చీఫ్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చిత్రం విడుదలపై ఈవీఏ ఐవీఎఫ్ హాస్పిటల్ యాజమాన్యం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.యశోద సినిమాలో సమంత క్యారెక్టర్ ఇవా హాస్పటల్ రేపిటేషన్ దెబ్బతినెలా చూపించారాని పిటిషన్ దాఖలు చేయడంతో కోర్ట్ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 19 వరకు ఓటీటీలో చిత్ర ప్రదర్శన చేయకూడదని , తదుపరి విచారణను డిసెంబర్ 19 కు వాయిదా వేసింది కోర్ట్.
హరి, హరీష్ యశోద చిత్రాన్ని తెరకెక్కించగా, శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. మెడికల్ మాఫియా కాన్సెప్ట్ తో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో సమంత నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ప్రెగ్నెంట్ ఉమెన్ గా సమంత పాత్ర పవర్ ఫుల్ గా కనిపించింది. తనకు ఎదురైన కఠిన పరిస్థితులను ఎదురించి పోరాడే మహిళగా ఆమె కనిపించగా, రావు రమేష్, సంపత్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్నిముకుందన్‌తోపాటు కల్పిక ఇతరులు కీలక పాత్రలలొ కనిపించి మెప్పించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…