Yandamuri Veerendranath : యండమూరి వీరంద్రనాథ్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన రచయితగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. చిరంజీవికి .. యండమూరి వీరేంద్రనాథ్ కి మధ్య ఒకప్పుడు మంచి సాన్నిహిత్యం ఉండేది. యండమూరి రాసిన ఛాలెంజ్ .. అభిలాష వంటి నవలలను సినిమాలుగా తీయగా చిరంజీవి హీరోగా నటించారు. అవి ఘన విజయాలను అందుకున్నాయి కూడా. అయితే ఆ మధ్య జరిగిన ఒక సంఘటన వాళ్ల మధ్య దూరం పెంచుతుందని అంతా భావించారు. తన జీవితచరిత్రను యండమూరి రాస్తారని మెగాస్టార్ ఇటీవల ఒక వేదికపై ప్రకటించడం అందరినీ ఆశ్ఛర్యపరిచింది. యండమూరి వీరేంద్రనాథ్ రచయితగా మాత్రమే కాకుండా మోటివేషనల్ స్పీకర్ గా మంచి గుర్తింపు పొందారు. మోటివేషనల్ స్పీకర్ గా ఆయన యువతకి మంచి మంచి సలహాలు ఇస్తూ వారి భవిషత్తు ప్రణలికల కోసం సూచనలు చేసేవారు.
యండమూరి వీరేంద్రనాథ్ , మెగాస్టార్ చిరంజీవి గారికి మధ్య మంచి అనుబంధం ఉంది. మెగాస్టార్ నటించిన ఎన్నో సినిమాలకు యండమూరి పనిచేశాడు. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మృగరాజు సినిమాకి సంబంధించిన కొన్ని సీన్లు ఎలా పెట్టాలో చెప్పినట్టు ఒక ఇంటర్వ్యూ లో యండమూరి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మృగరాజు సినిమాలో అడవిలో ఉండే చిరంజీవిని ఒక ఐఏఎస్ చదువుతున్న అమ్మాయి ప్రేమించటానికి ఎలాంటి సన్నివేశాలు పెట్టాలి అన్న విషయం తో పాటు మరొక 2,3 సీన్లు కూడా కూడా చెప్పానని ఆయన వెల్లడించారు.మృగరాజు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో యండమూరి వీరేంద్రనాథ్ కుమారుడు పెళ్లి జరిగింది.
![Yandamuri Veerendranath : నా కొడుకు పెళ్లి కోసం చిరంజీవిని అప్పు అడిగా.. ఆయన ఏం అన్నాడంటే..! Yandamuri Veerendranath sensational comments on chiranjeevi](http://3.0.182.119/wp-content/uploads/2024/04/yandamuri-veerendranath.jpg)
అయితే చిరంజీవిగారితో యండమూరికి ఉన్న మంచి అనుబంధం కారణంగా తన కుమారుడి పెళ్లికి రెండు, మూడు లక్షల డబ్బులు అవసరం అవుతాయని చిరంజీవి గారికి చెప్పారు. దీంతో చిరంజీవిగారు దేవి ప్రసాద్ తో మాట్లాడి సినిమా కోసం తాను చెప్పిన 2,3 సీన్లకు 4 లక్షల రూపాయలు డబ్బు ఇప్పించినట్టు ఈ ఇంటర్వ్యూ లో యండమూరి చెప్పుకొచ్చారు. ఇద్దరి మధ్య ఇంత మంచి అనుబంధం ఉందా, మరి ఓ సందర్భంలో ఎందుకు చిరంజీవిపై ఆయన కొడుకుపై యండమూరి అలా మాట్లాడాడు అంటూ ముచ్చటించుకుంటున్నారు.