Raghurama Krishnam Raju : ఏపీలో రాజకీయం వేడెక్కింది. మరి కొద్ది రోజులలో ఎలక్షన్స్ జరగనుండగా, ఏ పార్టీ ఏపీలో జెండా ఎగరవేస్తుందని ప్రతి ఒక్కరు ముచ్చటించుకుంటున్నారు. ఇక ఇదే క్రమంలో రఘురామ కృష్ణంరాజు టీడీపీలోకి వెళ్లనున్నారని ప్రచారం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు.. ఆ తర్వాత రెబల్‌గా మారి ప్రభుత్వం తిరుగుబాటు బావుటా ఎగరేసారు. అప్పటి నుంచి వీలైనపుడల్లా.. వైసీపీ అధినేత జగన్‌ను టార్గెట్ చేస్తూ ఈయన వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో జత కట్టి ఓ కూటమిగా ఎన్నికల రంగంలోకి దిగారు.ఈ నేపథ్యంలో సీటు పంపిణిలో ఈ మూడు పార్టీల్లో ఎవరికీ నరసాపురం ఎంపీ స్థానం.. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని చెప్పిన రఘురామకు.. బీజేపీ కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఆ సీటును భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేటాయించారు. ఈయన నరసాపురం పార్లమెంట్ స్థానంలో గత 30 యేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తోన్నారు. భూపతిరాజు శ్రీనివాస వర్మ అక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో రఘురామ తనకు ఎంపీ టికెట్ రాకుండా.. బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, వైసీపీతో కలిసి కుట్ర చేసి తనకు టికెట్ రాకుండా చేసారని ఆరోపణలు గుప్పించారు. అయితే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు శుక్రవారం టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. నర్సాపురం నుంచి ఆయన టీడీపీ తరపున బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఒకవేళ నరసాపురం కాకపోతే ఉండి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మకు టికెట్ కేటాయించింది బీజేపీ. అయితే నరసాపురం సీటుకు బదులుగా ఏలూరు టికెట్ కేటాయించాలన్నది టీడీపీ ప్లాన్. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్‌యాదవ్ పేరు ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. ఈ క్రమంలో సీట్లు సర్దుబాటు జరిగే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు కడప బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పేరు బలంగా వినబడుతోంది. ఒకవేళ టీడీపీ గనుక కడప ఎంపీ టికెట్ బీజేపీకి ఇస్తే.. జమ్మలమడుగు నుంచి భూపేష్‌రెడ్డి దించాలని ఆలోచన చేస్తోంది. ఆదినారాయణ సోదరుడు కొడుకు భూపేష్‌రెడ్డి. అలాగే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సీటును మొదటి నుంచి బీజేపీ ఆసక్తి చూపడంలేదు.