Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు. ఈసారి అలాంటి తప్పు జరగ్గకుండా ఆయన చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే కాపులు అధిక సంఖ్యలో ఉండే పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారాయన. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ విసృతంగా పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తన స్నేహితులతో ఇక్కడ కార్పొరేట్ స్థాయి ఆస్పత్రిని కట్టిస్తానని నియోజకవర్గ ప్రజలకు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఐదు రోజుల పాటు పిఠాపురంలోనే మకాం వేసిన పవన్ కల్యాణ్ తన గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాల గురించి టీడీపీ నేతలతో చర్చించారు.
కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బ్లేడ్లతో కోస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కలిసేందుకు వస్తున్న వారిలో కిరాయి మూకలు కూడా వస్తున్నాయన్న పవన్.. వాళ్లు బ్లే్డ్లతో కోస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.రోజూ నన్ను కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు వస్తున్నారు. అలా వచ్చేవారిలో కిరాయిమూకలు కూడా ఉంటున్నాయి. అలా వచ్చే కిరాయి మూకలు సన్న బ్లేడ్లతో నన్ను, నా సెక్యూరిటీని కోస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల పన్నాగాలు మనకు తెలుసు కదా.. జాగ్రత్తగా ఉందాం. అభిమానులు పెద్దసంఖ్యలో వచ్చినప్పుడు ఫోటోల కోసం కొన్ని ప్రొటోకాల్ పద్ధతులు పాటిద్దాం. అందరితో కలిసి ఫోటోలు దిగాలని నాకూ ఉంటుంది. ప్రతిరోజు 200 మందిని కలుస్తా” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
![Pawan Kalyan : నన్ను చాలా తక్కువగా మాట్లాడారు.. పిఠాపురంలో గెలవరా అని అన్న వాళ్లకి ఒకటే చెబుతున్నా..! Pawan Kalyan sensational comments about his pithapuram winning](http://3.0.182.119/wp-content/uploads/2024/04/pawan-kalyan.jpg)
ఇక తాను భీమవరంలో ఒడిపోయిన ఈ సారి పిఠాపురంలో మాత్రం తప్పక గెలుస్తానంటూ తెలియజేశారు. నేను ఇక్కడే ఉండి ప్రజల సమస్యల మీద తప్పక పోరాటం చేస్తా. పిఠాపురం ప్రజలకి దగ్గరగా ఉంటూ అన్ని విధాలుగా సాయపడతాను అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఆయన మరో మూడు రోజులు విశ్రాంతి తీసుకొని ఆయన తిరిగి రాజకీయమైన పనులతో బిజీ కానున్నారు.