Yamudiki Mogudu : స్వశక్తితో ఇండస్ట్రీలో టాప్ హీరో స్థాయికి చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎంత ఎదిగిన కూడా ఒదిగి ఉండడం ఆయన స్పెషాలిటీ. ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన ఏనాడు తన సేవా కార్యక్రమాలు మరువలేదు. మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఒకడిగా ముందుంటున్నాడు చిరంజీవి.కేవలం తనే కాకుండా తన సోదరులను, తన వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసి వారికి కూడా ఒక గుర్తింపు అందరిలా చేశాడు. ప్రస్తుతం చిరు తన వారసులకు పోటీగా దూసుకుపోతున్నాడు.
వరుసగా అవకాశాలు అందుకుంటూ మంచి సక్సెస్ లు అందుకుంటున్నాడు.ఇక ఈ వయసులో కూడా ఆయన యాక్షన్ స్టంట్ లు చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే.ముఖ్యంగా ఆయన డాన్స్ స్టెప్పులు మాత్రం మామూలుగా ఉండవని చెప్పాలి. ఈ వయసులో కూడా అంత గ్రేస్‌తో డాన్స్ చేయటం అనేది మామూలు విషయం కాదని చెప్పాలి. అందుకే చిరంజీవికి అంత మంచి అభిమాన గణం ఉందని చెప్పాలి.ఇక ఇప్పుడు ఆయన ఖాతాలో వరుసగా మరో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఇటీవల కుర్ర డైరెక్టర్స్‌కి వరుస అవకాశాలు ఇస్తున్నాడు మెగాస్టార్.
చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాలలో యముడికి మొగుడు ఒకటి. ఇందులో కైకాల సత్యనారాయణ యముడిగా నటించారు. ‘హెవెన్ కెన్ వెయిట్’ నవల ఆధారంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రంలో విజయశాంతి, రాధ కథానాయికలుగా నటించారు. ఇందులో చిరంజీవి డైలాగులకు యువత రెచ్చిపోయారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు చాలా కేంద్రాల్లో 100 రోజులు ఈ సినిమా ఆడింది. ఈ క్రమంలో ‘యముడికి మొగుడు’ శత దినోత్సవం చేశారు. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.దాంతో చలించిపోయిన చిరు ఆత్మహత్య చేసుకున్న రైతులకు చెందిన పత్తి రైతుల కుటుంబ సభ్యుల ను పిలిపించి, వారికి ఆర్ధిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. చిరు గొప్ప మనసుకి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…