Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సారి రాజకీయాలలో తన సత్తా ఏంటో చూపించాలని గట్టిగా అనుకుంటున్నారు. పవన్ ఇప్పుడు సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చి ఎక్కువగా రాజకీయాలకే సమయం కేటాయిస్తున్నారు. అనేక కార్యక్రమాలు రాజకీయ సభలలో పాల్గొంటున్నారు. అయితే పవన్ రీసెంట్‌గా ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వచ్చే ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేశారు. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు స్థానాలలో జనసేన పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే భీమిలి, పెందుర్తి, గాజువాక, ఎలమంచిలి స్థానాలకు సమన్వయకర్తలను సైతం నియమించింది. అయితే ఉమ్మడి విశాఖ జిల్లా నేతల సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది అంటూ భరోసా ఇచ్చారు. జనసేన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తామని అన్నారు. 2019 ఎన్నికల తర్వాత పార్టీ బలంగా నిలిచేందుకు దోహదపడ్డ నాయకులకు అండగా ఉంటామని చెప్పారు. అలాగే ఎన్నికల్లో మూడింట ఒకవంతు పదవులు దక్కించుకుందామన్న పవన్.. క్షేత్రస్థాయి నుంచి బలాన్ని సద్వినియోగపరుకొంటూ కూటమిని గెలుపు దిశగా తీసుకెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. వ్యక్తిగతంగా తన గెలుపు గురించి ఆలోచించడం లేదని.. సమిష్టిగా గెలుపు కోసమే తన అడుగులు ఉంటాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
![Pawan Kalyan : పవన్‌ను చూసేందుకు వచ్చి కింద పడ్డ మహిళ.. పవన్ అప్పుడు ఏమన్నారంటే..? woman fell down up on seeing Pawan Kalyan](http://3.0.182.119/wp-content/uploads/2024/02/pawan-kalyan-1.jpg)
ఇక ఇదిలా ఉంటే విశాఖపట్నంలో అన్నయ్య నాగబాబుతో కలిసి సమీక్షలు నిర్వహించిన పవన్ కల్యాణ్ తాజాగా నాలుగు స్థానాలకు తాము పోటీ చేస్తున్నామంటూ ఆ స్థానాల్లో పోటీ చేసే తన పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించారు. భీమిలికి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌ను, పెందుర్తికి పంచకర్ల రమేష్ బాబును, గాజువాకకు సుందరపు సతీష్ కుమార్‌ను, యలమంచిలికి సుందరపు విజయ్ కుమార్‌ను ఇన్‌చార్జ్‌లుగా ప్రకటించారు. పెందుర్తి జోలికి ఇతరులు ఎవరు వచ్చినా సహించేది లేదని టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి ఇప్పటికే హెచ్చరించారు. అయితే పవన్ మీటింగ్స్‌లో ఆయనని చూసేందుకు చాలా మంది క్యూ కడుతున్నారు. ఓ మహిళ పవన్ ని చూసేందుకు రాగా, కిందపడబోయింది. అప్పుడు ఆయన ఆమెని ఆప్యాయంగా పలకరించి ఎందుకుమ్మా, నేనే వస్తున్నా కదా అని ఆమెకి చెప్పడం జరగింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.