RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన గొప్ప చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్, భీమ్‌గా తారక్‌లు అద్భుతంగా నటించారు. ఈ క్రమంలోనే ఈ మూవీ భారీ ఎత్తున కలెక్షన్లను కూడా సాధించింది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కచ్చితంగా ఆస్కార్ అవార్డులకు ఎంపిక అవుతుందని భావించారు. కానీ అలా జరగలేదు. దీంతో చాలా మంది తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్‌లకు ఎందుకు ఎంపిక కాలేదు.. అనే విషయం వెనుక పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా ఆస్కార్ లకు ఎంపిక కావాలంటే.. మూడు ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకటి.. చిత్రం స్థానికంగా తీసింది అయి ఉండాలి. అలాగే స్థానిక దేశానికి చెందినది అయి ఉండాలి. చిత్రంలో ఆ దేశ సంస్కృతి, సంప్రదాయాలను చూపించాలి. అలాగే ఆ చిత్రంలోని భాషను స్థానికంగా ఎక్కువ మంది మాట్లాడాలి. అయితే ఇవన్నీ ఆర్ఆర్ఆర్‌కు ఉన్నాయి. కానీ ఇందులో ఓ వర్గానికి చెందిన వారినే ఎక్కువగా చూపించారని.. అందువల్ల ఈ మూవీని ఎంపిక చేస్తే.. అనవసరంగా వివాదాలు వస్తాయేమోనని భావించే.. జ్యూరీ సభ్యులు ఆర్ఆర్ఆర్ ను ఆస్కార్‌కు నామినేట్ చేయలేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ ఒక గొప్ప చిత్రంగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్‌తో సినిమా తీయనున్నారు. ఈ క్రమంలోనే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి కథా చర్చల్లో పాల్గొంటున్నారు. మహేష్, రాజమౌళి సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే వేసవికి ముగుస్తుంది. ఆ తరువాత రాజమౌళి సినిమాను ప్రారంభిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…