Nagarjuna : ది ఘోస్ట్ సినిమాకి నాగార్జున తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

Nagarjuna : టాలీవుడ్ కింగ్ నాగార్జున స‌రైన విజ‌యం చూసి చాలా కాలం అయిపోయింది. కానీ ఆయ‌న వ‌రుస‌గా సినిమాలు చేస్తూనే ఉంటున్నారు. నేటి త‌రం యంగ్ హీరోల‌కు గానీ త‌న‌ ఇద్ద‌రు కొడుకుల‌కి కానీ ఆయ‌న‌ స్టైల్ లో న‌ట‌న‌లో గ‌ట్టి పోటీ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తాజాగా ఘోస్ట్ సినిమా ద్వారా చాలా రోజుల త‌రువాత‌ నాగార్జున ఒక స్టైలిష్ లుక్ లో క‌నిపించనున్నాడు. ఈ చిత్రంలో ఆయ‌న ఇండియ‌న్ ఎంబ‌సీలో ప‌నిచేసే ఒక రిటైర్డ్ రా ఏజెంట్ పాత్ర‌ను పోషిస్తున్నాడు. ఈ ఘోస్ట్ చిత్రం టీజ‌ర్ ఇంకా ట్రైల‌ర్లతోనే ప్రేక్ష‌కుల‌లో ఎంతో ఆస‌క్తిని రేకెత్తించింద‌ని అలాగే అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నార‌ని తెలుస్తుంది. నాగార్జున కూడా ఈ సినిమా విజ‌యంపై ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నట్టుగా స‌మాచారం. అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ మూవీని వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంట‌ర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో నాగార్జున‌తోపాటు సోనాల్ చౌహాన్, బాలీవుడ్ న‌టి గుల్ ప‌నాగ్, అనిక సురేంద్ర‌న్, శ్రీకాంత్ అయ్యంగార్, ర‌వి వ‌ర్మ‌, మ‌నీష్ చౌద‌రి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గుంటూర్ టాకీస్, పీఎస్వీ గ‌రుడ వేగ చిత్రాల‌తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్ర‌వీన్ స‌త్తారు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Nagarjuna remuneration for ghost movie
Nagarjuna

ఇక ఈ సినిమా చేయ‌డం కోసం నాగార్జున తీసుకున్న రెమ్యున‌రేష‌న్ విష‌యానికి వ‌స్తే ఇందుకు గాను ఆయ‌న రూ.6 కోట్ల పారితోషికం అందుకున్న‌ట్లు ప‌రిశ్ర‌మ వ‌ర్గాల స‌మాచారం. అంతే కాకుండా ఆంధ్ర‌లోని కొన్ని ఏరియాల్లో సినిమా పంపిణీ హ‌క్కుల ద్వారా కూడా ఆయ‌న‌కు ఆదాయం రానుంది. సినిమాపై వచ్చే లాభాల్లో కూడా ఆయ‌న‌కు షేర్ ఉంటుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

రూ.20 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాకు నాగార్జున చేసిన‌ భారీ యాక్ష‌న్ సీన్లు హైలైట్ గా నిలుస్తాయ‌ని చెబుతున్నారు. అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇంకా అబ్బుర ప‌రిచే స్టంట్లు ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపిస్తాయ‌ని అంటున్నారు. ఇంత వ‌ర‌కు ఇలాంటి పాత్ర చేయ‌ని నాగార్జున కెరీర్ లో ఈ సినిమా ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Share
editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago