Sr NTR : నందమూరి తారక రామారావు.. ఈ పేరుకే ఓ చరిత్ర ఉంది.. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న మహానటుడు ఎన్టీఆర్. ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు లేడనే చెప్పాలి. నటుడిగానే కాదు రాజకీయ నాయకుడిగాను ఎందరో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఎన్టీఆర్ ఇతరుల కన్నా ప్రత్యేకంగా ఉండేవారు. ప్రతి విషయంలోను తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న ఎన్టీఆర్ అనేక మందితో అనేక రకాలుగా పిలిపించుకునేవారు. తాపీనేని రామారావు ఎన్టీఆర్ ను రామారావు గారు అని సంబోధించేవారు. కమలాకర కామేశ్వర రావు ఎన్టీఆర్ ను ఫన్నీగా దొంగ రాముడు అని పిలుచుకునేవారు.
ఇక ఎన్టీఆర్ ను ఎంతగానో ప్రేమించేవారు అన్నగారు అని పిలిచేవారు. అయితే ఎన్టీఆర్ ను తొలిసారి అన్నగారు అని పిలిచిన వ్యక్తి దాసరి నారాయణరావు. దాసరిగారే ఎన్టీఆర్ కు అన్నగారు అని పేరు పెట్టారు. స్పీచ్‌లలో దాసరి.. ఎన్టీఆర్‌ని అన్న పిలవడంతో మిగతా వారు కూడా అన్న అని పిలుస్తూ ఉన్నారు. మీడియా కూడా ఎన్టీఆర్‌ని అన్న అని సంబోధించడంతో ఆ పేరు అలా నిలిచిపోయింది. అభిమానులు, శ్రేయోభిలాషులు, అందరూ ఎన్టీఆర్ ని అన్న లేదంటే బ్రదర్ అని పిలిచే వారు. ఇక సినిమాల విషయంలో షూటింగ్ కి వెళ్లేటప్పుడు కూడా ఒకరి వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదన్న సిద్ధాంతంతో వెళ్లేవారట ఎన్టీఆర్.
ఉదయం 6 గంటలకు షూటింగ్ ఉందంటే 5 గంటల 45 నిమిషాలకు సెట్ కు చేరుకునేవారట. ఇప్పుడు బాలయ్య కూడా అదే టైమింగ్ పాటిస్తారు. ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు ఉండడేమో..? ఈయన దూరమై 26 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆయన గుర్తుల్లోనే ఉన్నారు తెలుగు జనం. ఇటీవల ఈ మహానటుడి శత జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…