సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాను వేరే ఇతరత్ర కారణాలతో చేయకపోవడం.. ఆ సినిమాను వేరే హీరోకు కలిసి రావడం ఎప్పటి నుంచో ఉందనే విషయం మనకు తెలిసిందే.. అయితే సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీలోని టాప్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునతో కలిసి నటించగా, వెంకటేష్‌తో మాత్రం ఇప్పటి వరకు కలిసి నటించలేదు. వాస్తవానికి వెంకటేష్ హీరో అవుతానని అస్సలు అనుకోలేదట. వాళ్ల బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాలని అనుకున్నారట. వెంకటేష్ హీరోగా మారడానికి సూపర్ స్టార్ కృష్ణనే కారణమట.
వెంకటేష్‌ను వాళ్ల నాన్న ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి రామానాయుడు హీరోను చేద్దామనుకోలేదు. అంతేకాదు తన ఇద్దరు కొడుకులైన సురేష్, వెంకటేష్‌లను పెద్ద బిజినెస్ మేన్‌లుగా తీర్చిదిద్దాలనుకున్నారు. ముందుగా రామానాయుడు తన పెద్ద కొడుకు సురేష్ బాబుతో ఓ ఫ్యాక్టరీ కూడా పెట్టించారు. కానీ అంతగా వర్కౌట్ కాలేదు. దాంతో తండ్రి రామానాయుడుతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలు చూసుకోవడం మొదలుపెట్టారు సురేష్ బాబు. ఇక వెంకటేష్‌ను సైతం నిర్మాతగా లేదా వ్యాపారవేత్తగా చేద్దామనుకొని అతనితో యూఎస్‌లో ఎంబీఏ చదివించారు రామానాయుడు. కానీ వెంకటేష్ మాత్రం అనుకోకుండా.. హీరో అవ్వడం జరిగింది. ఇక వెంకటేష్ హీరోగా మారడం వెనక పెద్ద కథే నడిచింది.
సూపర్ స్టార్ కృష్ణ సెకండ్ జనరేషన్ స్టార్ హీరోలందరితో దాదాపు కలిసి నటించారు. కానీ విక్టరీ వెంకటేష్ తో మాత్రం అస్సలు నటించలేదు. మెగాస్టార్ చిరంజీవితో కొత్త అల్లుడు, బాలకృష్ణతో సుల్తాన్, నాగార్జునతో వారసుడు లాంటి చిత్రాల్లో నటించారు. ఒక్క త్రిమూర్తులు సినిమాలో ఓ పాటలో వెంకటేష్ తో కొన్ని సెకన్ల పాటు కనిపించారు. ప్రత్యేకంగా వీరు కలిసి నటించిన సినిమా అయితే లేదు. చిరు, బాలయ్య, నాగార్జునలతో కలిసి నటించిన కృష్ణ వెంకటేష్ తో మాత్రం కలిసి నటించలేకపోయారు. అనివార్య కారణాల వలన కృష్ణ.. వెంకటేష్ కలిసి నటించకపోగా,వారి కాంబినేషన్ రూపొందకుండా ఉండడంపై అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…