Aravinda Sametha : త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్‌టీఆర్, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా వచ్చిన అరవింద సమేత మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ ఎన్‌టీఆర్‌తోపాటు అటు త్రివిక్రమ్, పూజా హెగ్డెల కెరీర్‌లోనూ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఇక ఈ మూవీలో నటి ఈశ్వరీ రావు రెడ్డమ్మ పాత్రలో నటించి మెప్పించింది. జగపతిబాబు విలన్‌గా అదరగొట్టేశారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. అదేమిటంటే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అరవింద సమేత చిత్రంలో నటి ఈశ్వరీరావు పోషించిన రెడ్డమ్మ పాత్రకోసం ముందుగా లయని చిత్ర యూనిట్ అడిగిందట. అయితే అనివార్య కారణాలతో అందులో నటించడానికి ఒప్పుకోలేదట. ఆ తర్వాత ప్రముఖ నటి ఈశ్వరీరావుకి ఆ ఛాన్స్ దక్కింది. రెడ్డమ్మ పాత్రకి ఆమె నూరు శాతం న్యాయం చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె నటన హైలైట్ అని చెప్పవచ్చు.
కాగా లయ సినిమాల్లో చేస్తున్న రోజుల్లో రాజకీయ ప్రచారంలో కూడా పాల్గొంది. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ విజయవాడ లోక్ సభ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీచేస్తే ఆయనకు మద్దతుగా ప్రచారం చేసింది. ఇక సినిమాల్లో రాణిస్తున్న సమయంలో అమెరికాకి చెందిన గణేష్ గుర్తి అనే ఓ వైద్యుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక సినిమాలకు పూర్తిగా దూరమైన లయ ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఉంటోంది. ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే 2018 లో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో హీరో తల్లి పాత్రలో చేసింది. కానీ ఆ మూవీ డిజాస్టర్ అయింది. అయితే ఇకపై ఆమె సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కానీ తన కుమార్తెను సినీ రంగ ప్రవేశం చేయిస్తుందని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…