నరసింహ మూవీలో సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలు పెడుతుంది క‌దా.. అస‌లు అప్పుడు ఏం జ‌రిగిందో తెలుసా..?

సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ కెరిర్ లో ఘన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో నరసింహ కూడా ఒకటి అని సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రజనీకాంత్ మేనరిజం, వే ఆఫ్ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను అప్పట్లో ఎంతగానో ఆకట్టుకుంది. నా దారి రహదారి అనే డైలాగ్ ఇప్పటికి కూడా ప్రేక్షకులు సరదాగా వాడుతూ ఉంటారనే విషయం చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన సౌందర్య హీరోయిన్ గా నటించారు. అయితే నరసింహ సినిమాలో హీరో, హీరోయిన్ తో పాటుగా విలన్ గా నటించిన నీలాంబరి క్యారెక్టర్ ఈ చిత్రానికి ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి. నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ ప్రతినాయకగా తన అద్భుతమైన నటనను కనబరిచింది. ఈ సినిమా విజయానికి రమ్యకృష్ణ నటించిన నీలాంబరి పాత్ర కీ రోల్ అని చెప్పుకోవచ్చు.

ఈ చిత్రానికి గాను కె.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. దర్శకుడు రవికుమార్ ఒక ఇంటర్వ్యూలో నరసింహ చిత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సినిమా స్టోరీని సిద్ధం చేసుకున్న తర్వాత ఇందులో నీలాంబరి పాత్ర కోసం చాలా మందిని అనుకున్నారట. మొదటగా నీలాంబరి క్యారెక్టర్ లో మీనాని అనుకోగా, ఆమె అయితే అంత పొగరుబోతు  పాత్రలో సెట్ కాదని భావించి .. నగ్మాతో చేయాలి అనుకున్నారట. కానీ నగ్మా ఇప్పటికే కొన్ని సినిమాల్లో బిజీగా ఉండడంతో, డేట్స్ కుదరకపోవడంతో చివరకు రమ్యకృష్ణకు ఈ సినిమా కథ చెప్పటం జరిగిందట. మొదట రజనీకాంత్ కి వ్యతిరేకంగా ఉన్న పాత్ర చేయడానికి ఆలోచించిన రమ్యకృష్ణ ఆ తర్వాత ఒప్పుకుంది.

what really happened during narasimha movie making

అయితే చిత్రకధాంశం ప్రకారం ఇందులో రమ్యకృష్ణ రజినీకాంత్ ను ప్రేమిస్తే.. రజినీకాంత్ మాత్రం రమ్య దగ్గర పని చేసే సౌందర్యను ప్రేమిస్తాడు. దాంతో నరసింహా(రజినీకాంత్) ను ఎలాగైనా దక్కించుకోవాలి అని ఉద్దేశంతో నాటకం ఆడి తన పెళ్లి అతనితో ఫిక్స్ చేసుకుంటుంది నీలాంబరి. ఈ విషయం తెలిసిన సౌందర్య చాలా డల్ గా రమ్యకృష్ణ కాళ్ళుకు గోరింటాకు పెడుతుంటే.. తన కాలిని సౌందర్య మొఖం మీద ఉంచి పక్కకు తిప్పే సన్నివేశం ఒకటి ఉంటుంది. అయితే ఈ సీన్ చేయడానికి రమ్యకృష్ణ మొదట అసలు ఒప్పుకోలేదట. ఈ సీన్ ఖచ్చితంగా చేయాలి అని ఆమె చేత బలవంతం చేసిన తర్వాత  ఏడ్చేసిందట రమ్యకృష్ణ. .. కానీ చివరకు సౌందర్య, రజినీకాంత్ ఇలా అందరూ చెప్పేసరికి ఒప్పుకుంది రమ్యకృష్ణ అని రవికుమార్ ఆ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.

Share
Mounika Yandrapu

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago