సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన రాజకుమారుడు. ప్రేక్షకుల హృదయానే కాదు హీరోయిన్ నమిత హృదయాన్ని కూడా దోచుకొని పెద్దలను ఒప్పించి మరి ప్రేమ వివాహం చేసుకున్నాడు మహేష్. ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా మొదటి భార్య ఇందిరా దేవి ఉండగానే విజయనిర్మలను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ సూపర్ స్టార్ కుటుంబానికి ఒక సీనియర్ హీరోయిన్ తో అనుబంధం ఉంది.
ఆ హీరోయిన్ ఇంకెవరో కాదు లేడీ బాస్ విజయశాంతి. కృష్ణ ఫ్యామిలీ కి లేడీ బాస్ విజయశాంతికి ఉన్న అనుబంధం ఏమిటి..? మహేష్ బాబుకు విజయశాంతి వరుసకు ఏమవుతుంది..? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా ఈ విషయం తెలుసుకోవాలి అంటే సూపర్ స్టార్ కృష్ణ వివాహ జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవికి విడాకులు ఇవ్వకుండానే మొదటి భార్య అంగీకారంతో 1969లో విజయనిర్మలను ప్రేమించే వివాహం చేసుకున్నారు. మొదటి భార్య ఇందిరాదేవికి కృష్ణకు ఐదుగురు సంతానం ఉన్నారు. రమేష్ బాబు, పద్మావతి, మంజుల, మహేష్ బాబు, ప్రియదర్శిని. ఈ ఐదుగురు సంతానంలో మహేష్ బాబు, రమేష్ బాబు, మంజుల సినీమాల ద్వారా ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఇక విజయనిర్మల విషయానికొస్తే కృష్ణతో కలిసి నటించినప్పుడు ఏర్పడిన పరిచయం ఆ తర్వాత కాలంలో ప్రేమగా మారి వివాహ బంధానికి దారితీసింది.
విజయనిర్మల మొదటి భర్త అయిన కె.ఎస్. మూర్తికి విడాకులు ఇచ్చి సూపర్ స్టార్ కృష్ణ ను వివాహం చేసుకుంది. కృష్ణని వివాహం చేసుకున్న సమయానికి విజయనిర్మలకు మొదటి భర్తతో కలిగిన సంతానం నరేష్ ఉన్నాడు. రెండవ వివాహం చేసుకున్న కృష్ణ తన మొదటి భార్య ఇందిరా దేవిని కానీ, ఆయన ఐదుగురు సంతానాన్ని గాని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. అదేవిధంగా విజయనిర్మల కూడా తన మొదటి భర్తకుతో కలిగిన సంతానం నరేష్ కూడా విడిచిపెట్టలేదు.
అసలు విషయానికి వెళితే విజయశాంతికి కృష్ణ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటంటే..? విజయనిర్మల మొదటి భర్త కె.ఎస్ మూర్తి స్వయానా చెల్లెలు విజయలలిత. ఈమె విజయనిర్మలకు స్పయాన ఆడపడుచు అవుతుంది. ఒక దశాబ్దం పాటు విజయలలిత చాలా చిత్రాల్లో నటించి అప్పటిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వారికి ఆమె గుర్తుకు రావాలి అంటే వెంకటేష్ హీరోగా నటించిన సాహసవీరుడు సాగరకన్య చిత్రంలో విజయలలిత మాంత్రికురాలిగా నటించింది. ఇక విజయశాంతికి విజయలలిత స్వయానా పిన్ని వరుస అవుతుంది. దీని బట్టి విజయశాంతి మహేష్ బాబుకి స్వయాన వదిన వరుస అవుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…