ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ గౌరవం చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా, శిరీష్ ఖాతాలో ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. 2019లో వచ్చిన ABCD సినిమాతో డిజాస్టర్ అందుకున్న అల్లు శిరీష్ కొన్ని నెలలపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత మళ్ళీ ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. విజేత ఫేమ్ రాకేష్ శశి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా నవంబర్ 4న థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. కానీ అల్లు శిరీష్ ఖాతాలో ఇప్పటి వరకు భారీ హిట్ లేదు. అయితే ఇటీవల ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న శిరీష్ ఓ షాకింగ్ న్యూస్ బయట పెట్టాడు. ప్రముఖ హాస్యనటుడు అలీతో జరిగిన చాట్ షోలో చాలామందికి తెలియని ఒక వాస్తవాన్ని అలీ అడిగాడు. తన తండ్రి అల్లు అరవింద్‌కు ఎంత మంది పిల్లలున్నారని అలీ అడిగాడు. తన తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారని శిరీష్ దానికి బదులిచ్చాడు.
అల్లు వెంకటేష్, అల్లు రాజేష్, అల్లు అర్జున్ మరియు తాను (అల్లు శిరీష్). తన రెండో అన్న రాజేష్ ఐదేళ్ల వయసులో ప్రమాదంలో మరణించాడని శిరీష్ వెల్లడించాడు. అప్పటికీ శిరీష్ పుట్టలేదట. అయితే ఇటీవల అల్లు అరవింద్ తన షోకు హాజరైనప్పుడు ఇదే ప్రశ్న అడగాలని అనుకున్నానని, అయితే అలాంటి ఎమోషనల్ క్వశ్చన్ వేసి అరవింద్ మూడ్ పాడుచేసే ధైర్యం చేయలేనని అలీ తెలిపాడు. ఇప్పటి వరకు అల్లు అరవింద్‌కు ముగ్గురు కొడుకులు మాత్రమే ఉన్నారని భావించినందున ఈ విషయం అందరినీ షాక్‌కు గురి చేసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…