Virat Kohli Tattoo : భారత మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పిన తక్కువే. కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన ఆట తీరు కనబరుస్తూ అందరి ప్రశంలసు అందుకుంటున్నాడు. అయితే విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లోని తన తొలి మ్యాచ్‌లోనే వీరవిహారం చేశాడు. ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించగా, ఈ మ్యాచ్తో విరాట్ కోహ్లీ ఆరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసిన కోహ్లీ ఐపీఎల్లో 50 సార్లు 50 ప్లస్ స్కోర్ చేసిన తొలి ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు.
ఇక టాటూలను ఇష్టపడే క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ముందుంటాడు అనే సంగతి మనందరికి తెలిసిందే. ఐపీఎల్ తొలి మ్యాచ్ లో కోహ్లీ చేతిపై కొత్త టాటూ కనిపించింది. ఆ టాటూకు అర్థమేంటని చాలామందిలో ఆసక్తి రేగింది. ఈ టాటూను కోహ్లీ ఇటీవలే ఏలియన్స్ టాటూ స్టూడియో ఓనర్ సన్నీ భానుషాలితో వేయించుకున్నాడు. కోహ్లీ కొత్త టాటూపై సన్నీ భానుషాలి వివరణ ఇచ్చారు. తన ఆధ్యాత్మికతను సంపూర్ణంగా ప్రతిబింబించేలా టాటూ ఉండాలని కోహ్లీ కోరాడని, జీవితచక్రం మొత్తం ఆ టాటూ ప్రతిఫలించాలని సూచించాడని తెలపడంతో అలాంటి టాటే వేసానని ఆయన అన్నాడు.
అయతే కోహ్లీ తన మనస్తత్వం ఆ టాటూలో ఉండాలని తనకు అర్థమైందని భానుషాలి వివరించారు. అందుకే, ఆ పచ్చబొట్టును అత్యంత కచ్చితత్వంతో వేసేందుకు ఎంతో కష్టపడినట్టు తెలిపారు. ఇక కోహ్లీకీ టాటూ వేసేటప్పుడు ఎవరూ రాకుండా స్టూడియోను మూసివేశామని, స్టూడియో చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. కోహ్లీ కొన్నేళ్ల కిందటే తమ కార్యాలయానికి వచ్చాడని, తమ టాటూల ఫొటోలను చూపించి వాటి గురించి ప్రశంసించాడని భానుషాలి చెప్పుకొచ్చారు.