Kohli : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్ మీద ఉన్నాడు. అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా తప్పుకున్న తరువాత కోహ్లి ఫామ్ కోల్పోయి తంటాలు పడ్డాడు. దీంతో ఓ దశలో జట్టులో చోటు కోల్పోతాడా.. అని ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే అందరి అంచనాలను తారు మారు చేస్తూ కోహ్లి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. గతేడాది నిర్వహించిన ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌లో సెంచరీతో కదం తొక్కాడు. 3 ఏళ్ల తరువాత కోహ్లి ఈ సెంచరీ చేయడం విశేషం. అలాగే గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లోనూ కోహ్లి 113 పరుగులు చేశాడు. ఈ ఏడాది జనవరిలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ కోహ్లి 2 వన్డేల్లో 2 సెంచరీలను నమోదు చేశాడు. ఇలా కోహ్లి ఈ మధ్య ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు. అయితే తాజాగా కోహ్లి మీడియాతో మాట్లాడుతూ తన మాజీ టీమ్ మేట్, మాజీ కెప్టెన్ ధోనిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
తన చిన్న తనం నుంచి తన క్రికెట్ కోచ్, ఫ్యామిలీ తన కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నారని.. తనకు ప్రోత్సాహం అందించారని కోహ్లి తెలిపాడు. తరువాత అనుష్క శర్మ తన జీవితంలోకి వచ్చినప్పటి నుంచి తనకు ఎనలేని సపోర్ట్‌ను అందించిందని తెలిపాడు. అయితే వీరి తరువాత తనకు సపోర్ట్‌గా నిలిచిన ఏకైక వ్యక్తి ధోనీయేనని కోహ్లి తెలిపాడు. తాను గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధోనీ తనకు ఎంతో విలువైన సలహాలు ఇచ్చాడని, ధోనీ వల్లే తాను మళ్లీ ఫామ్‌లోకి వచ్చానని చెప్పాడు.
నువ్వు స్ట్రాంగ్ గా ఉండి.. నీ ఆట నువ్వు ఆడితే.. నీ గురించి ఎవరూ మాట్లాడరని.. నువ్వ ఫామ్ కోల్పోతే నీ వైపే అందరూ వేలెత్తి చూపిస్తారని.. అప్పుడు ఇంకా కష్టమవుతుందని.. కనుక అలాంటి పరిస్థితిలోంచి బయట పడాలని.. తనకు ధోనీ సలహా ఇచ్చాడని.. కోహ్లి తెలియజేశాడు. ఈ మేరకు కోహ్లి తన ఐపీఎల్ టీమ్ ఆర్‌సీబీ నిర్వహించిన ఓ పాడ్ కాస్ట్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు.
అయితే కోహ్లి ఈ విధంగా ధోనీని ఆకాశానికి ఎత్తేయడంతో.. అటు కోహ్లితోపాటు ఇటు ధోనీ ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోతున్నారు. ధోనీ తరువాత నిజమైన కెప్టెన్సీ చేయగల సమర్థుడు కోహ్లియే అని ట్వీట్ చేస్తున్నారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్ అవుతోంది. ఇక కోహ్లి ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనూ రాణిస్తున్నాడు. త్వరలో ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…