Virat Kohli : మరికొద్ది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ మొదలు కానున్న సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ ముగిసిన తరువాత వెస్టిండీస్-అమెరికాలో జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ మొదలుకానుంది. మొత్తం 20 దేశాలు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీ జూన్ 29వ తేదీన ముగియనుంది. అయితే టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు గాను అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటి వరకు అయితే జట్లను ప్రకటించలేదు. కనీసం 20 రోజుల ముందు జట్లను ప్రకటించే అవకాశం ఉంది. అప్పటికి ఐపీఎల్ ముగింపునకు వస్తుంది.
ఈ క్రమంలో ఐపీఎల్‌లో ప్రదర్శనను బట్టి జట్టును ప్రకటించవచ్చని బీసీసీఐ మాత్రమే కాదు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు సైతం ఆలోచిస్తున్నాయి. అయితే ఈ సంగతి అలా ఉంచితే భారత జట్టులో మాత్రం ఈసారి వరల్డ్ కప్ లో ఎవరు ఆడుతారా.. అని ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. ప్లేయర్లు చాలా మందే ఉన్నారు. మరి వారిలో జట్టులోకి ఎవరిని తీసుకుంటారు, ఫైనల్ 11 ఎవరు, కెప్టెన్‌గా ఎవరు ఉంటారు.. అని చాలా ప్రశ్నలు వస్తున్నాయి. వీటన్నింటికీ త్వరలోనే చెక్ పడే అవకాశం ఉన్నా.. ఒక్క విషయం మాత్రం క్రికెట్ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది.
విరాట్ కోహ్లికి ఎంత మంది అభిమానులు ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. భారత ప్లేయర్లందరి కన్నా కోహ్లికే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే కోహ్లి వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే బీసీసీఐ అతన్ని స్వయంగా తప్పుకోమని సలహా ఇస్తుందట. ఈ మేరకు ఆపనిని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు అప్పగించిందట. కారణం.. వెస్టిండీస్‌లో స్లో పిచ్‌లు ఉంటాయని, అవి కోహ్లికి సరిపోవని, కనుక కోహ్లి తనంతట తానుగా ఈ టోర్నీ నుంచి తప్పుకుంటే మంచిదని బీసీసీఐ ఇప్పటికే అతనికి సూచనలు చేసిందట. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ఇది నిజం అయితే ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురి కాక తప్పదని తెలుస్తోంది. మరి నిజంగానే కోహ్లి లేకుండా భారత జట్టు విండీస్ పర్యటనలో టీ20 వరల్డ్ కప్ గెలుస్తుందా.. లేక చతికిల పడుతుందా.. అన్నది త్వరలోనే తేలనుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…