CM Revanth Reddy : టీడీపీతో బీజేపీ పొత్తు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy : ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రతి రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పొత్తులు పెట్టుకుంటున్నారని.. 400 సీట్లు వస్తాయని నమ్మకం ఉంటే పొత్తులు ఎందుకు..? అని ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకున్నారని.. 400 సీట్లు గెలిచేలా ఉంటే చంద్రబాబుతో పొత్తు ఎందుకు..? అన్నారు. మహారాష్ట్రలో శివసేనను, ఎన్సీపీ పార్టీలను చీల్చారని ఫైర్ అయ్యారు. మేడ్చల్ ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేశంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా ఉంటే పొత్తులు పెట్టుకోవడం ఎందుకు అని బీజేపీ ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టి.. వాళ్ళతోనే పొత్తులకు దిగారని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్డీయే కూటమి మొత్తం అతుకుల బొంత అని ఎద్దేవా చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడంతో గత పదేళ్లలో మేడ్చల్‌లో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలను వేగంగా పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. కొందరు తమ ప్రభుత్వం ఆరు నెలల్లోనే కూలిపోతుందని అంటున్నారని.. తాము అల్లాటప్పాగా అధికారంలోకి వచ్చిన వాళ్లం కాదని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చేంత మొనగాడు ఎవడైనా ఉన్నాడా..? అంటూ ప్రశ్నించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే తమ కార్యకర్తలు ఊరకోరని అన్నారు. తాము మంచివాళ్లం కాబట్టే మీరు ఇంకా తిరుగుతున్నారని.. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ఫామ్ హౌస్ గోడలు ఉండవని వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే తమను టచ్ చేసి చూడాలని అని సవాల్ విసిరారు.

CM Revanth Reddy sensational comments on tdp and bjp alliance
CM Revanth Reddy

ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని కవిత మాట్లాడుతున్నారని.. తాము భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాల్లో 43 శాతం ఆడబిడ్డలకు ఇచ్చామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. లెక్కలతోపాటు పేర్లతో సహా చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ధర్నా చౌక్ వద్దన్న వాళ్లు.. ఇప్పుడు సిగ్గులేకుండా వెళ్లి ధర్నా చౌక్‌లో ధర్నా చేస్తున్నారని కవితను ఉద్దేశించి సెటైర్లు వేశారు. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయిందని విమర్శించారు. హరీశ్‌ రావు మేడిగడ్డకు రమ్మంటే రారని.. అసెంబ్లీలో మైక్ ఇస్తే మాట్లాడరని ఎద్దేవా చేశారు. మేడ్చల్ ప్రాంతానికి ఐటీ పరిశ్రమలు రావాలని.. ఇక్కడ భూముల విలువలు పెరగాలని అన్నారు రేవంత్ రెడ్డి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago