Vijay Devarakonda : లైగ‌ర్ దారుణ‌మైన ఫ్లాప్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ అనూహ్య‌మైన నిర్ణ‌యం..

Vijay Devarakonda : టాలీవుడ్ సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ కొన్నాళ్లుగా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్నాడు. రీసెంట్‌గా వ‌చ్చిన లైగ‌ర్ తో బిగ్గెస్ట్ హిట్ కొడ‌తాడ‌ని అంద‌రూ భావించ‌గా, అది ఘోరంగా దెబ్బ తీసింది. నిర్మాత‌ల‌కు దారుణ‌మైన న‌ష్టాల‌ను మిగిల్చింది. ఈ క్ర‌మంలో విజ‌య్ దేవ‌ర‌కొండ పెద్ద మ‌న‌సు చేసుకొని త‌న రెమ్యున‌రేష‌న్‌లో ఆరు కోట్ల రూపాయ‌ల‌ని నిర్మాత‌ల‌కు తిరిగి ఇచ్చేశాడట‌. ఆయ‌న మంచి మ‌న‌స్సుపై అభిమానుల‌తోపాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన లైగ‌ర్ ఆగస్టు 25వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. సినిమా టాక్ పరంగానే కాక కమర్షియల్ గాను డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమా తెరకెక్కించడానికి రెమ్యూనరేషన్లతో కలిపి సుమారుగా రూ.100 కోట్ల బడ్జెట్ అయింది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తి కావస్తోంది. అయితే బడ్జెట్ రికవరీ చేయడం కూడా దాదాపు అసాధ్యంగా చెబుతున్నారు.

Vijay Devarakonda reportedly given back his remuneration for liger movie
Vijay Devarakonda

ఈ నేపద్యంలో విజయ్ దేవరకొండ.. చార్మి కౌర్, పూరి జగన్నాథ్ సహా ఈ సినిమా నిర్మాతలకు అండగా నిలబడాలని తన రెమ్యునరేషన్ లో సింహభాగాన్ని వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. నిర్మాతల మీద ఆర్థిక ఒత్తిడి తగ్గించేందుకే విజయ్ ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నాడని అంటున్నారు. లైగర్​ మూవీని ప్రముఖ బాలీవుడ్ ​సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మిక్స్​డ్​ మార్షల్ ​ఆర్ట్స్​నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. లైగర్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగినా.. విడుదల తర్వాత సీన్​ మారిపోయింది. ఈ మూవీ విడుదలకు ముందు రూ.200 కోట్లకు పైగా వసూలు చేస్తుందని ఆశపడ్డ విజయ్​దేవరకొండ ఆశలు తలకిందులయ్యాయి.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

16 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

5 days ago