Venu Swamy : ఇటీవల సెలబ్రిటీల జాతకాలు చెబుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి. సమంత- నాగ చైతన్య విడాకుల గురించి చెప్పి అందరి దృష్టిని ఆకర్షించిన వేణు స్వామి .. నిహారిక విడాకుల గురించి కూడా ముందే చెప్పాడట. ఇక ఆయనతో ఇటీవల నిధి అగర్వాల్, రష్మిక, డింపుల్ వంటి వారు కూడా పూజలు చేయించుకోవడంతో చాలా ఫేమస్ అయ్యారు. అయితే ఆయన 2024లో సీఎం ఎవరు అవుతారని కూడా కొద్ది రోజుల క్రితం చెప్పుకొచ్చాడు. 2024 ఎన్నికల్లో కూడా జగనే ముఖ్యమంత్రి కాబోతున్నారని.. అది కూడా పవన్ కళ్యాణ్ వల్లనే ఆయన గెలవబోతున్నట్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ గెలిచినా.. తెలుగుదేశం పార్టీ ఓడినా.. లేదంటే రివర్స్ అయినా అది పవన్ కళ్యాణ్ వల్లే కానీ.. అతను గెలవడానికి మాత్రం కాదని వేణు స్వామి చెప్పారు.. వేరే వాళ్లని సీఎం చేయడానికే పవన్ కళ్యాణ్ ఉన్నదని వేణు స్వామి అన్నారు. అయితే టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసి.. పవన్ కళ్యాణ్‌ని సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే మాత్రం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు తప్పవని అన్నారు. అయితే చంద్రబాబు తాను కాకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడం అంటే అంతకు మించిన జోక్ ఉండదన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి అధికారం చేపడితే అది అంధకారమే అవుతుంది కాబట్టి వీళ్ల కలయిక ప్రత్యర్ధి అయిన జగన్‌కి లాభదాయకం అవుతుందని జోస్యం చెప్పారు వేణుస్వామి.
పవన్ కు జనాదరణ విపరీతంగా ఉంటుందని..కానీ, ఓట్లు పడవని చెప్పుకొచ్చారు.. గురు గ్రహం నీచంలో ఉండటంతో జగన్ ను తిట్టే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని..ఓట్లు మాత్రం జగన్ కే వేస్తారని విశ్లేషించారు వేణు స్వామి. అయితే రీసెంట్‌గా ఆయన తిరుమలలో ప్రత్యక్షం కాగా, ఆయనని 2024లో ఎవరు సీఎం అవుతారని ప్రశ్నించారు. దానికి స్పందించిన వేణు స్వామి నేను ముందు ఎవరు అవుతారని చెప్పానో వారే అవుతారు. దేవుడి ముందు పేర్లు చెప్పడం బాగుండదు అని వేణు స్వామి అన్నారు. ఆయన జోస్యంలో తిరుగుండదు అన్నట్టుగ కామెంట్ చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…