Venkatesh Soundarya : అందం, అభినయం, తెలుగుదనం కలిస్తే కనిపించే అందాల బొమ్మ. సహజ సౌందర్యంతో.. పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సౌందర్య. సిల్వర్ స్ర్కీన్‌పై ఈ అందాల బొమ్మ కనిపించగానే ప్రేక్షకుల హృదయం ఆనందంతో పొంగిపోతుంది. ఒకదశలో సౌత్‌లో నంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొంది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతుండగానే అందివచ్చిన అవకాశంతో సినీరంగంలోకి ప్రవేశించింది. సౌందర్య ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు.
ఇక సౌందర్య చాలామంది స్టార్ హీరోల పక్కన నటించినా కూడా వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ లో వచ్చిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే పవిత్రబంధం సినిమా 6 భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ సినిమా పెళ్లి చేసుకుందాం రా.. ఈ సినిమా కూడా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ ను అందుకుంది.
సౌందర్య వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా జయం మనదేరా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. అలాగే వీరిద్దరి పెయిర్ కు ఎక్కువ మంది అభిమానులు అయిన సినిమా రాజా. ఈ సినిమా తర్వాత వెంకటేష్ సౌందర్య పెయిర్ కి క్రేజ్ మరింత పెరిగింది. సౌందర్య వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన దేవి పుత్రుడు సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాతో సౌందర్య వెంకటేష్ కాంబినేషన్ కు కూడా బ్రేక్ పడింది. అంతేకాకుండా వెంకటేష్ హీరోగా నటించిన సూపర్ పోలీస్ సినిమాలో సౌందర్య సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…