Galodu Movie : సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై తన హవాని చూపిస్తూ స్టార్‌గా వెలుగొందుతోన్నాడు సుడిగాలి సుధీర్. సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన అతడు చాలా తక్కువ సమయంలోనే ఊహించని ఎత్తుకు ఎదిగిపోయాడు. ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉండడంతో హీరోగాను అతనికి ఆఫర్స్ వస్తున్నాయి. రీసెంట్‌గా గాలోడు అనే సినిమాతో పలకరించాడు. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని సంస్కృతి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు. ఇందులో గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించగా, సప్తగిరి, శకలక శంకర్, పృథ్వీ, సత్యకృష్ణలు ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ కొట్టిన ఈ సినిమాకి బంపరాఫర్ దక్కినట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ దాదాపు ఐదున్నర కోట్లకు అమ్ముడుపోయినట్లు ప్రచారం జరుగుతోంది. గాలోడు ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్‌హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు కూడా చెబుతున్నారు. బుల్లితెరపై సుధీర్‌కు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని భారీ ధరకు గాలోడు సినిమా ఓటీటీ హక్కులను హాట్‌స్టార్ కొనుగోలు చేసినట్లు సమాచారం. మొత్తం రూ. 5 కోట్లకు శాటిలైట్, ఓటిటి హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తుండగా, ఈ మూవీని వచ్చే నెలలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం గాలోడు థియేటర్స్లో సక్సెస్ ఫుల్‌గా నడుస్తుంది. ఈ మూవీ మాస్ ఆడియెన్స్ ని మెప్పిస్తూ.. కలెక్షన్స్ పరంగా నిర్మాతలను లాభాల బాటలో చేర్చిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.జులాయిగా తిరిగే ఓ యువకుడు హత్య కేసులో ఎలా చిక్కకున్నాడు. ఆ నేరం నుంచి బయటపడి తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడనే పాయింట్‌తో గాలోడు తెరకెక్కింది. సాఫ్ట్‌వేర్ సుధీర్ తర్వాత తర్వాత సుడిగాలి సుధీర్, రాజశేఖర్‌రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ఇది. తొలిరోజు కోటి రూపాయల వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన గాలోడు… ఓవరాల్‌గా ఫస్ట్ వీక్‌లో ఈ సినిమాకు ఏడు కోట్ల గ్రాస్‌ను, మూడున్నర కోట్ల షేర్‌ను సొంతం చేసుకుంది. గాలోడు ప్రీ రిలీజ్ బిజినెస్ రెండున్నర కోట్ల వరకు జరిగింది. థియేట్రికల్ రన్ ద్వారా ఫస్ట్ వీక్‌లో ప్రొడ్యూసర్స్‌కు కోటికిపైగా లాభాలు వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…