Venkatesh : ఒక్కోసారి కథపరంగా గాని, దర్శక నిర్మాతల డిమాండ్ పరంగా గాని ఒక చిత్రానికి ఉపయోగించిన టైటిల్ ని వేరొక హీరో సినిమాకి కూడా ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఒక జనరేషన్ హీరో మూవీకి ఉపయోగించిన సినిమా టైటిల్ ను మరో జనరేషన్ హీరో సినిమాలకు పెట్టడం జరుగుతుంది. ఇక అసలు విషయానికి వెళ్తే 1986 తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక ఏడాదిగా చెప్పుకోవలసిన సంవత్సరం. 1986 సంవత్సరంలో టాలీవుడ్ లో దాదాపు 118 సినిమాలు విడుదల కావడం గమనార్హం. ఆ ఏడాదిలోనే కృష్ణ తొలిసారిగా దర్శకత్వం వహించిన సింహాసనం చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి 70mm ను పరిచయం చేశారు. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ క్రమంలో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ఖైదీ రుద్రయ్య. 1986లో విడుదలైన ఈ చిత్రం కూడా ఘన విజయాన్ని సాధించింది. ఖైదీ రుద్రయ్య చిత్రంతో సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి హిట్ పెయిర్ గా టాక్ రావడంతో వీరి కాంబినేషన్ లోనే వచ్చిన మరో మూవీ జయం మనదే. ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకుంది. ఇదే జయం మనదే చిత్ర టైటిల్ ని కృష్ణ తర్వాత జనరేషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మరో హీరో సినిమాకు కూడా పెట్టడం జరిగింది.
ఆ హీరో ఇంకెవరో కాదు.. దగ్గుపాటి వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సెట్ చేసుకున్న విక్టరీ వెంకటేష్. 2000 సంవత్సరంలో ఎన్. శంకర్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ మరియు సౌందర్య కలిసి నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జయం మనదేరా. వెంకటేష్ నటించిన జయం మనదేరా చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇలా ఒకే టైటిల్ తో వచ్చిన కృష్ణ మరియు వెంకటేష్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్ ని సాధించాయి.