బాలకృష్ణ, శృతిహాసన్ ప్రధాన పాత్రలలో గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం వీరసింహారెడ్డి. బాలయ్య నటించిన సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, సింహా, లెజెండ్… ఇవన్నీ యాక్షన్, ఫ్యాక్షన్ మిక్స్ అయిన సినిమాలే. వాటితో ‘అఖండ’ విజయాల్ని అందుకొన్నారు బాలయ్య. ఇప్పుడు మరోసారి… రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో చేసిన సినిమా… ‘వీర సింహారెడ్డి. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రం ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఈ సినిమాలో బాలయ్య ఎలివేషన్లు గూజ్‌బమ్స్ తెప్పిస్తాయి. ఫైట్లు వస్తున్నప్పుడు వెండి తెరకు కళ్లప్పగించేస్తారు అభిమానులు. బాలయ్య ప్రధాన బలం.. డైలాగ్ డెలివరీ.
వాటిని దృష్టిలో ఉంచుకొని పవర్ ఫుల్ డైలాగులు రాశారు రచయిత బుర్రా సాయిమాధవ్. వాటిని బాలయ్య పలికిన విధానం కూడా బాగుంది. ఇవన్నీ ఓకే… కానీ వాటి మధ్య కథే… మరీ చిన్నదైపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఏదేమైన ఈ సినిమా ప్రేక్షకులని అలరించింది అనే చెప్పాలి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరగగా, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ‘వీరసింహారెడ్డి’ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే సినిమా ఓపెనింగ్ క్రెడిట్స్‌లో ఇదే విషయం ప్రదర్శించబడింది. కాగా సినిమా విడుదలైన 45 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
ఈ రోజు విడుదలైన బాలయ్య సినిమాకి పోటీగా మరే సినిమా విడుదల కాలేదు. దీంతో ఈ సినిమా కలెక్షన్లు భారీగా కొల్లగొట్టే అవకాశం ఉంది. ఇక ఫ్యాక్షన్ డ్రాప్ సీన్లు ఓ రేంజ్‌లో ఉన్నాయని, థియేటర్లలో బాలయ్య ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో భారీ హిట్స్ కొట్టిన బాలయ్య మరోవైపు అన్‌స్టాపబుల్‌తో ఆయన ఇమేజ్ ఇంకాస్త హైట్స్‌కు చేరింది. ఇన్ని పాజిటివ్ అంశాల నడుమ సినిమా ఖచ్చితంగా ఊహించని కలెక్షన్లు సాధిస్తుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.