సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య సినిమా వీరసింహారెడ్డి బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తుంది.భారీ అంచనాల నడుము గురువారం విడుదలైన ఈ సినిమాకోసం తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకి అనుమతి ఇవ్వడంతో తెల్లవారు జామున 4 గంటల నుంచే థియేటర్లలో హంగామా మొదలైంది. థియేటర్ల వద్ద అభిమానులు కోలాహలం మాములుగా లేదు. మరోవైపు భాగ్యనగరంలోనూ పలు థియేటర్స్ వద్ద అభిమానులతో పాటు పలువురు సెలబ్రెటీలు సందడి చేసిన నానా హంగామా చేశారు. కూకట్‌పల్లిలోని భ్రమరాంజ థియేటర్‌లో నారా బ్రాహ్మణి సినిమాను వీక్షించారు. ఇక్కడే బాలకృష్ణ సినిమా యూనిట్‌తో సినిమాను చూశారు.
హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద వీరసింహ రెడ్డి తొలి షో ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా, ఆ సమయంలో అభిమానులు జై బాలయ్య నినాదాలతో థియేటర్ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొనేలా చేశారు. అయితే వాల్తేరు వీరయ్య సినిమాకి పోటీగా ఈరోజు రిలీజైన బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సినిమాను కచ్చితంగా ఎందుకు చూడాలి అనడానికి ప్రధాన కారణాలు ఇవి . సంక్రాంతికి బాలయ్య సినిమాలు మంచి విజయాలు సాధిస్తాయి. అందుకు ఈ చిత్రం కూడా మంచి హిట్ కొడుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్మారు. ఇక బాలకృష్ణ ఫ్యాక్షన్ పాత్రలో నటించక చాలా రోజులైంది. వీర సింహారెడ్డి పక్కా ఫ్యాక్షన్.. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో పాటు ఇందులో తమన్ ఇచ్చిన పాటలు, సినిమాలోని బాలయ్య పంచ్ డైలాగ్‌లు అదిరిపోయాయి.
ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో బాలకృష్ణ, శృతి హాసన్ దుమ్ము దులిపారు. బాలయ్య- శ్రుతి హాసన్ డ్యాన్స్, కెమిస్ట్రీ చూసేందుకు ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర క్యూ కట్టారు. మరోవైపు యాక్టర్ దునియా విజయ్ ‘వీర ప్రతాప్ రెడ్డి’గా నెగిటివ్ రోల్‌లో టాలీవుడ్‌లో ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఇందులో పొలిటికల్ యాంగిల్ కూడా ఎక్కువే. సినిమాలో బాలయ్య లుక్, పొలిటికల్ పంచ్ డైలాగ్‌లు థియేటర్లలోనే కాకుండా బయట కూడా గట్టిగానే పేలాయి. ఇక పండుగ రోజున థియేటర్‌లో కొత్త సినిమా చూడకుండా మన తెలుగువాళ్లకు సంక్రాంతి పూర్తి కాదు. అందుకే ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ప్రేక్షకులని అలరించబోతున్నాయి.