Veera Simha Reddy : అఖండ తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం వీరసింహారెడ్డి. సంక్రాంతికి విడుదలై థియేటర్స్‌లో రచ్చ చేసిన ఈ చిత్రం గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. వీరసింహారెడ్డి డిజిటల్ రైట్స్‌ను దాదాపు పదిహేను కోట్లకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ థియేటర్ రిలీజ్‌కు ముందే దక్కించుకున్న విషయం విదితమే. థియేటర్స్ లో సెన్సేషన్ సృష్టించిన బాలయ్య ఓటీటీలోను రికార్డుల వేట మొదలుపెట్టాడు. విడుదలైన నిమిషంలో ఒక లక్షా యాభై వేల (150K) యూనిక్ వ్యూవర్స్‌ని సొంతం చేసుకుని రికార్డ్‌ను క్రియేట్ చేసింది బాలయ్య సినిమా.
ఈ విషయాన్నిడిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని , వై రవిశంకర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. చిత్రంలో బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో నటించగా, ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. ఇందులో వీరసింహారెడ్డి అనే ఫాక్ష్యన్ నాయకుడిగా, జై అనే యువకుడిగా బాలకృష్ణ నటించారు.
ఫ్యాక్షనిజాన్ని నిర్మూలించి రాయలసీమ యువతలో మార్పు కోసం ప్రయత్నించే వ్యక్తి కథతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు.ఈ పాయింట్‌కు అన్నాచెల్లెళ్ల పగ ప్రతీకారాలను జోడించారు. న్నడ స్టార్ దునియా విజయ్ మెయిన్ విలన్‌గా ఆకట్టుకున్నాడు. ఇక థమన్ అందించిన పాటలు, బీజీఎమ్ సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లాయి. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించింది. తద్వారా బాలకృష్ణ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఓటీటీలోను ఈ మూవీ రచ్చ చేస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…