Varahi Number : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికలను టార్గెట్ చేస్తూ ఇటీవల వారాహి అనే ఒక వాహనాన్ని కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు పవన్ .అయితే ఈ వెహికల్ వచ్చినప్పుడు నుంచి అధికార ప్రతిపక్ష నేతల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తుంది. ముఖ్యంగా ఈ వాహనం రంగు ఆర్మీ వాహనాలకు సంబంధించిన రంగులా ఉందని ఇలాంటిది వ్యక్తిగతంగా ఉపయోగించకూడదు అంటూ అధికార నేతలు విమర్శలు గుప్పించారు. అయితే వైసీపీ నేతలు చెప్పినట్లు పవన్ వారాహి కలర్ ఆలివ్ గ్రీన్ కాదని.. ఎమరాల్డ్ గ్రీన్ అని తెలంగాణ ఆర్టీఏ అధికారులు ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు.
ఏదైతేనేం ఇటీవల వారాహి వాహనానికి నెంబర్ కూడా రిజిస్ట్రేషన్ పూర్తి అయింది. పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ వారాహి TS 13 EX 8384 పేరుతో వారాహి రిజిస్ట్రేషన్ జరిగింది. ఇకపోతే డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు మాట్లాడుతూ… అది ఆలివ్ గ్రీన్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ అని తెలిపారు.ఇక ఈ వెహికల్ బాడీ బిల్డర్ ఇచ్చిన సర్టిఫికెట్ పరిశీలించిన అనంతరమే పర్మిషన్ ఇచ్చినట్టు తెలిపారు. TS 13 EX 8384 నెంబర్ తో రిజిస్ట్రేషన్ కోసం నిబంధనలకు అనుగుణంగా డబ్బును చెల్లించి ఈ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేయించుకోగా, ఈ నెంబర్ రిజిస్ట్రేషన్ కోసం 5000 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి రిజిస్ట్రేషన్ తీసుకున్నారు.
అయితే వారాహి రిజిస్ట్రేషన్ నంబర్‌కు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ ఫోన్ నంబర్ చివరి నాలుగు అంకెలు వారాహి రిజిస్ట్రేషన్ నంబర్ ఒకేటూ నంటూ ఆన్‌లైన్‌లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. కాగా వారాహిలో భద్రతా పరంగా చాలా సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. పవన్ వెహికిల్‌లో ఉండగా, ఆయన పర్మిషన్ లేకుండా చీమ కూడా లోనికి వెళ్లలేనంత పటిష్టంగా తయారుచేశారు దీన్ని. అంటే ఎటువైపు నుంచి ఎందరు వచ్చి డోర్ ఓపెన్ చేద్దామన్నా.. విత్ అవుట్ యాక్సెస్ అది ఓపెన్ కాదు. వాహనంలో మరో ప్రత్యేకత హైడ్రాలిక్ మెట్లు అని చెప్పాలి.