Vangalapudi Anitha : చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు ఎంత రచ్చగా మారాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జగన్‌పై తీవ్ర విమర్శలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్‌పై టీడీపీ నేతల ఆరోపణలను ఘాటుగా తిప్పికొట్టారు మంత్రి రోజా. టీడీపీ నేతలు కూడా రోజాపై అంతే ఘాటుగా విమర్శలు గుప్పించారు. అంతేకాదు… ఈ మాటల యుద్ధం.. ఇప్పుడు వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. టీడీపీ నేత బంగారు సత్యనారాయణమూర్తి మంత్రి రోజాపై వ్యక్తిగత దూషణలు చేశారు. ఆమె క్యారెక్టర్‌పై నిందలు వేశారు. పర్సనల్ వీడియోలు తన దగ్గర ఉన్నాయంటూ.. అవి బయట పెడితే ఏమవుతుందో చూసుకోవాలంటూ హెచ్చరించారు.
బండారు వ్యాఖ్యలపై తీవ్ర మనస్తాపం చెందిన మంత్రి రోజా… మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. ఒక మహిళా మంత్రిని నీచంగా మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. మంత్రి రోజా కన్నీరుపెట్టుకోవడంపై కూడా టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే రోజా విమర్శలపై పలువురు సినీ నటులు కొందరు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. అయితే అనిత మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి రోజా ఇన్ని రోజులు చాలా వెటకారంగా మాట్లాడిందని.. ఈరోజు ఆమె వరకు వస్తేగానీ బాధ తెలియలేదా? అని ప్రశ్నించారు.
2014-19 మధ్య కాలంలో అసెంబ్లీలో తన గురించి రోజా చాలా అసభ్యకరంగా మాట్లాడిందని చెప్పారు. ఆరోజు తాను ఏడిస్తే.. దొంగ ఏడుపులు అంటూ రోజా కామెంట్ చేసిందని అన్నారు. మరి ఇప్పుడు రోజా ఏడుపులు గ్లిజరిన్ ఏడుపులా?, మహానటి ఏడుపులా? అని ప్రశ్నించారు. రోజాను సమర్ధిస్తూ ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు మాట్లాడటం దౌర్భగ్యం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హీరోయిన్లు ఎవరూ మాట్లాడరని, ఆమె సహచర మంత్రులు ఎవరూ కూడా మాట్లాడరని.. కానీ తమిళనాడులోని హీరోయిన్లు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భార్య గురించి చాలా దారుణంగా మాట్లాడినప్పుడు సినీ ఇండస్ట్రీ, రోజాకు సపోర్టు చేస్తున్న హీరోయిన్లు ఏమయ్యారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరి గురించి అసెంబ్లీ సాక్షిగా నోటికొచ్చినట్టుగా మాట్లాడితే.. ఈ హీరోయిన్లు అప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
సినీ ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద హీరోలు సీఎం జగన్ వద్దకు వెళ్లి కాళ్లు మొక్కినప్పుడు వీళ్లు ఏమయ్యారని ప్రశ్నించారు. ప్రపంచంలో రోజా ఒక్కరే మహిళా? అని ప్రశ్నించారు. రోజాకు బాధ అంటే ఏమిటో ఈరోజు పరిచయం అయినట్టుగా ఉందేమో అని అన్నారు. కానీ తమకు బాధ ఏమిటో రోజా ఎప్పుడో పరిచయం చేసిందని అన్నారు. తమ ఫొటోలను మార్పింగ్ చేస్తున్నారని.. మరి అలాంటప్పుడు ఈ హీరోయిన్లు ఎందుకు బయటకు రారని ప్రశ్నించారు. రోజాను సమర్ధించిన వాళ్లు వారి విలువను దిగజార్చుకున్నారని అనిత అన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…