Upasana Mother : మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మరో కొత్త వ్యక్తి రావడంతో ఇప్పుడు ఆ ఇంట సంబరాలు అంబరాన్నంటుతున్నాయి..అందుకు కారణం రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్లైన 11 యేళ్ల తర్వాత ఓ బిడ్డకు జన్మనివ్వడం. మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు సైతం ఈ వార్త విని ఫుల్ ఖుష్ అయ్యారు. మా ఇష్ట దైవం ఆంజనేయ స్వామికి ప్రీతి పాత్రమైన మంగళ వారం రోజున మా ఇంటికి మహా లక్ష్మీ వచ్చిందని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. పాప పుట్టిన ఘడియలు చాలా బాగున్నాయని కూడా ఆయన చెప్పారు. మీడియాతో మాట్లాడిన చిరంజీవి ఆ సమయంలో చాలా సంతోషంగా కనిపించారు. తెల్లవారు జామున 1:49 గంటలకు శుభగడియల్లో పాప జన్మించిందని చెప్పిన చిరు.. పాత్రికేయులు అడిగిన చాలా విషయాలకు సమాధానాలు చెప్పారు.
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడబిడ్డ పుట్టడంతో తమ ఫ్యామిలీలో సంబరాలు షురూ అయ్యాయని, ఈ ఆడబిడ్డ పుట్టుక మాకు అపురూపం అని చిరంజీవి అన్నారు.ఎన్నో సంవత్సరాలుగా వారిద్దరి తల్లిదండ్రలు కావాలని కోరుకుంటున్నాం. ఇన్నేళ్ల తరవాత ఆ భగవంతుడి దయతో, అందరి అశీస్సులతో మా కోరిక నెరవేరిందని మెగాస్టార్ అన్నారు. ఇక ఉపాసన తల్లి కావడంతో మెగా ఫ్యామిలీనే కాక కామినేని ఫ్యామిలీ ఇంట కూడా ఆనందం వెల్లివిరిసింది. ఉపాసన తల్లి శోభన కామినేని అయితే విషయం తెలిసిన వెంటనే కారులో అపోలో ఆసుపత్రికి చేరుకుంది.
ఇక ఆసుపత్రి ఆవరణలో మీడియా ఉందనే విషయం కూడా పట్టించుకోకుండా పరుగెత్తుకుంటూ ఆసుపత్రిలోకి వెళ్లింది. త్వరగా మనవరాలిని చూడాలనే ఆతృత ఆమెలో స్పష్టంగా కనిపించింది. ఏది ఏమైన కూడా ఇన్నేళ్ల తర్వాత రామ్ చరణ్ దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో అందరు ఫుల్ ఖుష్ అవుతున్నారు. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు సైతం ట్విట్టర్ ద్వారా రామ్ చరణ్ దంపతులకి శుభాకాంక్షలు తెలియజేశారు. పాపని చూడాలని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, రానున్న రోజులలో అయిన పాప ఫొటో రిలీజ్ చేస్తారా లేదా అని నెటిజన్స్ ముచ్చటించుకుంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…