Unstoppable Movie Scene : బిగ్‍బాస్ ద్వారా పాపులర్ అయిన వీజే సన్నీ, ప్రముఖ కమెడియన్ సప్తగిరి ప్రధాన పాత్రల్లో రూపొందిన తాజా చిత్రం అన్‍స్టాపబుల్ మూవీ జూన్ 9న థియేటర్లలో విడుదలైంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా అనుకున్నస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో థియేటర్లలో ఎక్కువ కాలం ఆడలేకపోయిన ఈ చిత్రాన్ని సీమశాస్త్రి ఫేమ్ డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించాడు. కాగా, ఈ అన్‍స్టాబుల్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. స్ట్రీమింగ్ మొదలైంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయి.
అన్‍స్టాపబుల్ సినిమాలో వీజే సన్నీ, సప్తగిరితో పాటు నక్షత్ర, అక్సా ఖాన్, బిత్తిరి సత్తి, పృథ్వి, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, రఘుబాబు, విక్రమాదిత్య కీలకపాత్రల్లో నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. అన్‍స్టాపబుల్ చిత్రాన్ని రంజిత్ రావు నిర్మించాడు. చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్న కోహినూర్ కల్యాణ్ (వీజే సన్నీ), జిలానీ రామదాస్ (సప్తగిరి) తమ కుటుంబం వద్ద డబ్బులు తీసుకొని క్రికెట్ బెట్టింగ్ వేస్తారు. బెట్‍లో ఓడిపోతారు. వారి స్నేహితుడు హనీబాబు (షకలక శంకర్) పొరపాటున వేరే అకౌంట్‍లో డబ్బు డిపాజిట్ చేయటంతో ఆ ఇద్దరు ఇబ్బందుల్లో పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే అన్‍స్టాపబుల్ ప్రధానమైన కథగా ఉంది.
అయితే ఓ సన్నివేశంలో ఓ యువతి మద్యం మత్తులో 302 రూమ్‌కి వెళ్లబోయి 202కి వెళుతుంది. ఆ సమయంలో ఆమెని కొందరు అత్యాచారం చేస్తారు. అనంతరం ఆమె జీవితంలో ఏర్పడిన పరిస్థితులు ఏమిటి, డీజే టిల్లు మురళి, సూపర్ విమర్ లిరీషా, రాజా రవీంద్ర, పోసాని కృష్ణ మురళి, చమ్మక్ చంద్ర, విరాజ్ ముత్తంశెట్టి, గీతా సింగ్, రోహిణి, రూప లక్ష్మి, మణి చందన, విక్రమ్ ఆదిత్య, రఘుబాబు, ఆనంద్, చక్రపాణి, “గబ్బర్ సింగ్’ బ్యాచ్ ఎలాంటి పర్‌ఫార్మెన్స్ కనబరిచారు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. హైదరబాద్, నిజామాబాద్, గోవా వంటి పలు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…